Bigg Boss 16: వెయ్యి కోట్ల రెమ్యునరేషన్ పై క్లారిటీ ఇచ్చిన సల్మాన్ ఖాన్.. మనేద్దాం అనుకున్నా అంటూ..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బుల్లితెరపై కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బిగ్ బాస్ షో ద్వారా అతను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాలోనే అత్యధికమంది వీక్షించిన రియాలిటీ షోగా క్రేజ్ అందుకున్న బిగ్ బాస్ షో ఇప్పటికే 15వ సీజన్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు మరో కొత్త సీజన్ ను ప్రారంభించేందుకు సల్మాన్ ఖాన్ రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో అతను ఈ సీజన్ కు రూ.1000 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

సల్మాన్ అయితేనే బెటర్

సల్మాన్ అయితేనే బెటర్


హిందీలో బిగ్ బాస్ షో మొదలుపెట్టినప్పుడు చాలా రకాల నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. అసలు ముఖ్యంగా సల్మాన్ ఖాన్ హోస్టింగ్ చేయడంపై కూడా కొన్ని ట్రోల్లింగ్స్ అయితే వచ్చాయి. కానీ ఎప్పుడు కూడా సల్మాన్ ఖాన్ వాటిని పట్టించుకోలేదు. చాలా పాజిటివ్ గానే తన హోస్ట్ బాధ్యతను కొనసాగించాడు. మధ్యలో మరి కొంతమంది అతని స్థానంలో వచ్చినప్పటికీ ఆ తర్వాత మళ్లీ సల్మాన్ ఖాన్ అయితే బెటర్ అని నిర్వాహకులు ఆలోచించారు.

సల్మాన్ వివరణ

సల్మాన్ వివరణ

ఇక ఇప్పటివరకు 15 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకోగా ఇప్పుడు బిగ్ బాస్ 16వ సీజన్ కూడా మొదలు కావడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ ప్రత్యేకంగా మీడియా సమావేశంలో పాల్గొని ప్రస్తుతం వస్తున్న వార్తలపై అలాగే బిగ్ బాస్ అనుబుతిని కూడా తెలియజేశాడు. ఈ షో మొదట తాను చేస్తానా లేదా అనే అనుమానం ఉండేది అని కానీ ఆ తర్వాత చాలా తొందరగా బిగ్ బాస్ కు కనెక్ట్ అయిపోయినట్లుగా తెలియజేశాడు.

 రూ.1000 కోట్లపై సల్మాన్ కామెంట్

రూ.1000 కోట్లపై సల్మాన్ కామెంట్

ఇక చాలా రోజులుగా ఈ బిగ్ బాస్ సీజన్ కోసం నేను రూ.1000 కోట్లు తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అందులో అయితే ఎలాంటి నిజం లేదు. ఒకవేళ ఆ విధంగా అంత స్థాయిలో పారితోషకం వస్తే నేను ఇక మరో పని చేయాల్సిన అవసరం లేదు కదా. మీరు చెప్పిన దాంట్లో నాకు వస్తున్నది కనీసం నాలుగోవంతు కూడా లేదు.. అని సల్మాన్ ఖాన్ తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు.

 అంత వస్తే..

అంత వస్తే..


అలాగే ఏదో ఒక రోజు ఆ స్థాయిలో వస్తే మాత్రం తప్పకుండా తీసుకుంటాను అంటూ ఎందుకంటే నాకు కూడా చాలా ఖర్చులు ఉన్నాయి అని న్యాయవాదులకు అలాగే ఇతర ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయని సల్మాన్ ఖాన్ ఉన్నాడు. అంతే కాకుండా ఈ తరహా వార్తలను ఆదాయప పన్ను శాఖ వారు అలాగే ఈడి కూడా చూస్తుంది అని సరదాగా సల్మాన్ ఖాన్ వివరణ ఇవ్వడం వైరల్ గా మారుతోంది.

 మధ్యలో చేయాలని అనిపించలేదు

మధ్యలో చేయాలని అనిపించలేదు

ఒకానొక సమయంలో అయితే బిగ్ బాస్ హోస్ట్ గా చేయడానికి చాలా ఇబ్బంది కలిగింది. అందులో జరిగిన గొడవలు నన్ను ప్రభావితం చేయలేదు. కానీ ఎందుకో మధ్యలో చేయాలని అనిపించలేదు. కానీ వాళ్లకు కూడా మరొకరు దొరకలేదు. దీంతో మళ్లీ నన్నే పిలుచుకువచ్చారు. ఒకవేళ వాళ్ళకి మరో ఆప్షన్ ఉంటే మాత్రం తప్పకుండా మరొకరిని తీసుకునే వారేమో అని సల్మాన్ ఖాన్ చాలా ఫ్రెండ్లీగా కూడా తెలియజేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X