సల్మాన్ సహ నటుడు మోహిత్ కన్నుమూత.. క్యాన్సర్‌తో పోరాడుతూ..

బాలీవుడ్ సినీ, టీవి రంగాలకు చెందిన యువ నటుడు మోహిత్ బెగెల్ ఆకస్మిక మరణంతో హిందీ చిత్ర పరిశ్రమ షాక్ గురైంది. గత కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మోహిత్ తన సొంత పట్టణం మధురలో కన్నుమూశారు. మోహిత్ మృతి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. పరిణితి చోప్రా, సిద్ధార్థ్ మల్హోత్రా, రాజ్ శాండిల్యా లాంటి సినీ తారలు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు.

మోహిత్ కెరీర్ చోటే మియా అనే చిత్రంతో మొదలైంది. సల్మాన్ నటించిన రెడీ చిత్రంలో మోహిత్ ఆయన పక్కన నటించడంతో కమెడియన్‌గా మంచి గుర్తింపు పొందారు. అలాగే పరిణితి, సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి జబ్రియా జోడి అనే చిత్రంలో కూడా నటించారు.

Salman Khan co actor Mohit Baghel

ఫిల్మ్ మేకర్ రాజ్ శాండిల్య ఎమోషనల్‌గా ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు. మోహిత్ ఇంత త్వరగా ఈ లోకం నుంచి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది. నీకోసం ఈ సినిమా ప్రపంచమంతా ఆగిపోయింది. మళ్లీ అన్ని పూర్తి చేసుకొని తిరిగా. మనం చాలా మంచి పనులు చేయాల్సి ఉంది అంటూ ట్వీట్ చేశారు.

మోహిత్ మరణ వార్తతో నేను షాక్ తిన్నాను. నేను కలిసి నటించిన మంచి నటుల్లో మోహిత్ ఒకరు. ఎప్పుడూ నవ్వుతూ, పాజిటివ్‌గా కనిపించారు. నీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని పరిణితి చోప్రా పేర్కొన్నారు.

సిద్ధార్థా మల్హోత్రా మరణ వార్త విని తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను. మోహిత్ చురుకైన, యువ కళాకారుడు. ప్రతిభ ఉన్న నటుడు. ఆయనతో కలిసి ఓ సినిమాలో నటించడం మంచి అనుభూతి.. ఈ వార్తతో నేను అప్‌సెట్ అయ్యాను. ఆయన కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలి. అతని ఆత్మకు శాంతి చేకూరాలి అని పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X