కరోనా పోరాటంపై సల్మాన్ ఖాన్ పాట.. స్వయంగా రాసి.. కంపోజ్ చేసి
ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు సృష్టిస్తున్న కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్‌లో ఉంటున్న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పేద కళాకారులకు స్వయంగా ఆర్థిక సహాయం అందించడమే కాకుండా ప్రజలకు ఈ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా కరోనాపై పోరాటంలో భాగంగా సల్మాన్ మరో ప్రయత్నం చేస్తున్నారు.
ప్రాణాంతక వ్యాధిపై అవగాహన కల్పించడానికి పాటను కంపోజ్ చేసి స్వయంగా పాడనున్నారు. త్వరలోనే డిజిటిల్ రిలీజ్ ద్వారా ప్రేక్షకులకు, అభిమానులకు చేరువ చేయనున్నారు. ఈ విషయాన్ని సల్మాన్ మేనేజ్ జోర్డీ పటేల్ ధృవీకరించారు.

సల్మాన్ పాట రికార్డు చేసిన విషయం నిజమే. సోమవారం అన్ని మ్యూజిక్ పోర్టల్స్‌లో విడుదల చేస్తాం. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు బలమైన సందేశం ఇవ్వడానికి చేసిన ప్రయత్నం ఇది. సల్మాన్ స్వయంగా రాసి పాడారు. ప్రతీ ఒక్కరికి ఈ పాట నచ్చుతుంది అని జోర్డీ అన్నారు.
గతంలో సల్మాన్ ఖాన్ పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి. మై హూ హీరో తెరా, హ్యాంగోవర్ చిత్రాల కోసం పాడారు. దబంగ్3, భజరంగీ భాయ్‌జాన్ చిత్రాల్లోని జగ్ ఘూమ్ గయా, బేబీ ఖో బేస్ పసంద్ హై, యూ కుర్కే పాటలకు వాయిస్ కూడా అందించారు. అయితే ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల కోసం పాట పడటం ఇదే మొదటిసారి.
Recommended Video
లాక్‌డౌన్ సమయాన్ని ముంబైకి సమీపంలోని పన్వేల్ ఫామ్‌హౌస్‌లో గడుపుతున్నారు. ఇటీవల తన స్నేహితురాలు ఇలియా వాంటర్ లైవ్ ఛాట్ షోలో కనిపించారు. ఈ మధ్యకాలంలో కరోనా పరిస్థితులపై స్వయంగా వీడియోలు రిలీజ్ చేశారు.


Click it and Unblock the Notifications











