ఆ రూమర్లను నమ్మొద్దు.. తప్పుడు ప్రచారంపై ఖండన.. సల్మాన్ ఖాన్ సీరియస్
కరోనా లాక్‌డౌన్ సందర్బంగా స్వీయ గృహ నిర్బంధం నుంచి బయటకు వచ్చిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముంబైలోని తన ఇంటికి చేరుకొన్నారు. గత రెండు నెలలుగా ముంబైకి సమీపంలోని తన ఫామ్‌హౌస్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడానికి ముందు పన్వేల్‌లోని ఫామ్‌హౌస్‌లో తన మేనల్లుడి పుట్టినరోజు పండగకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వస్తున్న కొన్ని రూమర్లపై స్పందించారు. ఆ రూమర్లు ఏమింటంటే..
Recommended Video

లాక్‌డౌన్‌లో ఫామ్‌హౌస్‌లోనే
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో తన మేనల్లుడి బర్త్ డే వేడుకలకు వచ్చిన జాక్వలైన్ ఫెర్నాండేజ్, లూలియా వాంటర్, వలుస్చా డిసౌజా సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లోని ఉండిపోయారు. సల్మాన్ ఖాన్‌తో కలిసి వారు క్వారంటైన్ పిరియడ్‌ను ఎంజాయ్ చేశారు. రెండు నెలల లాక్‌డౌన్‌లో సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ప్రాణాంతక వ్యాధి బారిన పడకుండా ఎలా ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై అవగాహన కల్పించారు.

విరాళాలు, పేదలకు సహాయం
ఇక తన పన్వేల్ ఫామ్‌హౌస్‌లో ఉంటూనే విరాళాలు అందించారు. అలాగే పేదలకు నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలను సరఫరా చేశారు. అంతేకాకుండా లాక్‌డౌన్ సమయంలో ఫామ్‌హౌస్‌లో ఉన్న అనుభవాలకు తేరా బినా అంటూ ఓ అల్బమ్‌ను రూపొందించారు. జాక్వలైన్ ఫెర్నాండేజ్‌తో కలిసి ఈ ఆల్బమ్‌లో కనిపించారు. తాజా విడుదలైన ఈ వీడియోకు యూట్యూబ్‌లో ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తున్నది.

తమపై వస్తున్న రూమర్లపై
ఇలాంటి పరిస్థితుల్లో సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్‌పై వస్తున్న రూమర్లను సల్మాన్ ఖాన్ ఖండించారు. తమ సంస్థలో రూపొందబోయే సినిమా కోసం నటీనటులు ఎంపిక జరుగుతుందనే ప్రచారాన్ని ఖండించారు. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేస్తూ.. నేను గానీ, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ గానీ నటీనటుల ఎంపిక చేపట్టడం లేదు. అలాగే మేము ఏ క్యాస్టింగ్ ఎజెన్సీని నియమించుకోలేదు. మా తదుపరి సినిమాల నిర్మాణం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని సల్మాన్ ఖాన్ చెప్పారు.

చట్టపరంగా కఠిన చర్యలు
సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్ నటీనటులు ఎంపిక చేపట్టిందని వచ్చే ఈమెయిల్స్, లేదా సందేశాలు మీ వద్దకు వస్తే వాటిని నమ్మకూడదు. అలాగే ఎస్కేఎఫ్ పేరును దుర్వినియోగం చేస్తే లీగల్ యాక్షన్ తీసుకొంటాం. మా సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలపై మేము తీవ్రంగా పరిగణిస్తాం అని సల్మాన్ ఖాన్ ఓ ప్రకటనను విడుదల చేశారు.


Click it and Unblock the Notifications











