దూసుకుపోతోన్న దబాంగ్ 3 ఐటెమ్ సాంగ్.. సల్మాన్ స్టెప్పులు వైరల్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలంటే ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే సల్మాన్ సినిమాలు ఒకెత్తు అయితే.. అందులోని పాటలు, సంగీతం మరో ఎత్తు. సల్మాన్ ఖాన్ నటించిన, నటించే ప్రతీ సినిమా మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక మాస్ బీట్స్‌కు అయితే సల్మాన్ ఖాన్ చిత్రాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. దబాంగ్, భజరంగీ భాయీజాన్, కిక్, కిక్ 2, భారత్, టైగర్ జిందా హై లాంటి చిత్రాల్లో పాటలు ఇప్పటికీ మార్మోమోగుతూనే ఉంటాయి.

మాస్ బీట్స్‌లో సల్మాన్ ఖాన్ చిత్రాల్లో మున్నీ బద్నామ్ హూయీ.. సాంగ్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్‌గా నిలిచిపోతుంది. ఈ ఒక్క పాటే అప్పట్లో ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. ఈ పాటలో సల్మాన్ ఎనర్జీ, మలైకా అరోరా అందాలు ఇలా ప్రతీ ఒక్కటి పాటను హిట్ చేశాయి. అది నచ్చే మన గబ్బర్ సింగ్‌లో కెవ్వుకేక సాంగ్‌ను డిజైన్ చేశారు. అయితే దబాంగ్ 2 చిత్రంలోనూ కరీనా కపూర్‌తో చేసిన ఓ ఐటెమ్ సాంగ్ కూడా అదిరిపోయింది. తాజాగా దబాంగ్ 3లోమరోసారి ఐటెమ్ సాంగ్‌తో రెచ్చిపోయేందుకు సిద్దమయ్యాడు.

Salman Khan Dabangg 3 Munna Badnaam Hua Song Released

దబాంగ్ సిరీస్ లో మూడో భాగం ఈ నెల 20న క్రిస్మస్ కానుకగా, ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోనూ ఓ ఐటమ్ సాంగ్ ఉంది. ఈ పాటలో సల్మాన్ తో పాటు మమతా శర్మ నర్తించింది. 'మున్నా బద్మామ్ హువా' అంటూ సాగే పాటను నిన్న రాత్రి విడుదల చేయగా, ఇప్పటికే దాదాపు కోటి వ్యూస్ సాధించి, టాప్‌లోకి వెళ్లిపోయింది. ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారి దూసుకెళ్లోన్న ఈ వీడియో సాంగ్‌ను మీరూ ఓ సారి చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X