Don't Miss!
- News హరీశ్.. రాజీనామా చేతిలో పెట్టుకో: మామ అల్లుళ్లపై రేవంత్ ఫైర్, వరంగల్‌కు కీలక హామీలు
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సినిమా నాది.. పోస్టర్స్ నావే.. ప్రమోషన్ కూడా నేనే చేసుకుంటా
బాలీవుడ్లో ఎదురులేకుండా దూసుకుపోతున్న హీరోల్లో సల్మాన్ ఖాన్ ముందుంటాడు. బాలీవుడ కండల వీరుడు ఖాన్ త్రయంలో అందరికీ ముందున్నాడు. తీసిని ప్రతీ సినిమా వందకోట్లను కలెక్ట్ చేస్తుంది. కొన్ని సినిమాలు వంద కోట్లను కొల్లగొట్టడానికి నానా తంటాలు పడితే.. సల్మాన్ సినిమా మాత్రం అవలీలగా వసూళు చేస్తుంది.
సల్మాన్ సినిమా అంటే మినిమమ్ వంద కోట్లు..
ఇక సల్మాన్ సినిమా అంటే తక్కువలో తక్కువ కనీసం వందకోట్లు కలెక్ట్ చేస్తుందని తెలిసిందే. అయితే సినిమాలోని కథాకథానలతో సంబంధం లేకుండా హిట్లుగా నిలుస్తాయి. వంద కోట్లు కలెక్ట్ చేసిన సినిమాను హిట్ అని అంటాం.. కానీ సల్మాన్ ఖాన్ చిత్రానికి మాత్రం అలా చెప్పలేం.
వంద కోట్లు కలెక్ట్ చేస్తే.. ఫ్లాప్ అని ఎలా అంటారు..
దాదాపు తొమ్మిది చిత్రాలు వరుసగా వంద కోట్లను కలెక్ట్ చేసి తిరుగులేని రికార్డులను క్రియేట్ చేశాడు. అయితే ఆ మధ్య వచ్చని ట్యూబ్ లైట్ చిత్రంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదే విషయాన్ని సల్మాన్ ముందు ప్రస్తావించగా.. వందకోట్లను దాటేసి సినిమాను ఫ్లాప్ అని ఎలా అంటారని సల్మాన్ తిరిగి ప్రశ్నించాడు. అలా సల్మాన్ తెరపై కనిపిస్తే చాలు.. వందకోట్లు అనేవి మినిమమ్ గ్యారెంటీ అనే ముద్ర పడింది.
తాజాగా భారత్ మూవీతో ప్రేక్షకుల ముందుకు..
స్వతంత్ర్యం రాక పూర్వం నుంచి ప్రస్తుతం వరకు జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన కల్పిత చిత్రంలో సల్మాన్ విభిన్న పాత్రలను పోషించాడు. అయితే సల్మాన్ లుక్స్, ట్రైలర్, సాంగ్స్ ఇలా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. తీరా మూవీ రిలీజై.. అంచనాలను అందుకోలేకపోయింది. అయినా.. రికార్డు కలెక్షన్లను సాధించింది. అదే మరి మా సల్లూ భాయ్ స్టామినా అని సల్మాన్ అభిమానులు కాలర్ ఎగరేశారు.
Recommended Video
తాజాగా దబాంగ్3తో సిద్దమయ్యాడు..
ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ దబాంగ్3 చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ మూవీని ప్రభుదేవా అద్భుతంగా తీసినట్లు సమాచారం. అయితే తాజాగా రిలీజ్ చేసిన దబాంగ్3 టీజర్ ఎంత వైరల్ అయిందో అందరం చూశాం. చుల్ బుల్ పాండేగా సల్మాన్.. మరోసారి అభిమానులను మెస్మరైజ్ చేసేందుకు వస్తున్నాడు. సినిమా నాది.. పోస్టర్ నాది.. ప్రమోషన్ కూడా నేనే చేయాలి కదా అంటూ ఓ టీజర్ ను రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ మూవీ డిసెంబర్ 20న రిలీజ్ కానుంది.