కొట్టేది నేనే..కాపాడేది నేనే.. యాక్షన్, కామెడీతో అదరగొట్టిన సల్మాన్
దబాంగ్ సిరీస్ బాలీవుడ్‌లో ఏ రేంజ్‌లో వర్కౌట్ అయిందో అందరికీ తెలిసిందే. చుల్‌బుల్ పాండేగా సల్మాన్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దబాంగ్‌తో బాక్సాఫీస్ రికార్డులను బద్దలకొట్టేశాడు సల్మాన్ ఖాన్.
ఇక ఈ సిరీస్‌లో మూడో పార్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సల్మాన్ రెడీ అయ్యాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేయగా.. రీసెంట్‌గా సినిమాలోని ఒక్కో క్యారెక్టర్‌ను రివీల్ చేసుకుంటూ వచ్చాడు. చిత్ర నిర్మాత కూడా తానే అవడంతో ప్రమోషన్ బాధ్యతలను కూడా తన భుజానే వేసుకున్నాడు.
కొద్ది సేపటి క్రితమే ఈ మూవీ ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా సల్మాన్ విడుదల చేశారు. సల్మాన్ స్టైల్ యాక్షన్‌తో పాటే.. అదిరిపోయే కామెడీ టైమింగ్ కూడా ఆకట్టుకుంది. విలన్లతో సీరియస్‌గా ఉంటూనే కామెడీ చేసి అందర్నీ నవ్వించాడు. అయితే కామెడీ ఎంతలా చేశాడో.. యాక్షన్ సీన్స్‌లో అంతలా రెచ్చిపోయాడు.. ఒక్కడే పోలీస్.. ఒక్కడే రౌడీ ఉంటాడు.. కానీ నేను రౌడీ పోలీస్, కొట్టేది నేనే కాపాడేది నేను అంటూ సల్మాన్ చెప్పిన డైలాగ్‌లు అదిరిపోయాయి.

విలన్‌గా కిచ్చా సుదీప్ ప్లస్ అయ్యేట్టు కనిపిస్తున్నాడు. మరో సారి మీ హృదయాలను దోచుకునేందుకు చుల్ బుల్ పాండే వచ్చేశాడు అంటూ సోనాక్షి సిన్హా ఈ ట్రైలర్‌ను షేర్ చేసింది. ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











