హీరోయిన్లతో లిప్ కిస్.. అది పెద్ద విషయం కాదు.. అన్నయ్యకు ఎప్పుడూ అదే పని!
వెండి తెరపై లిప్ కిస్సులు అనేది ఇపుడు సర్వ సాధారణమైన విషయంగా మారిపోయింది. అంతకు మించిన ఘాటు సన్నివేశాలతోనే సినిమాలు తెరకెక్కించేస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఇంత వరకు పెళ్లి చేసుకోలేదని కానీ.. ఈ బాలీవుడ్ స్టార్ కు చాలా ప్రేమ వ్యవహారాలే ఉన్నాయి. ఈ కండల వీరుడికి వలలో చాలా మంది స్టార్ హీరోయిన్లు పడ్డారు. కానీ ఏది కూడా విజయవంతమైన ప్రేమ కథ కాలేదు. కానీ సినిమాల విషయానికి వస్తే మాత్రం సల్లూభాయ్ కొన్ని విలువలు పాటిస్తాడు. తన చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ అందరరూ చూసే విధంగా ఉండాలనేది సల్మాన్ పాటించే సిద్ధాంతం.

సల్మాన్ ఖాన్ సినిమాల్లో లిప్ లాక్స్
ప్రస్తుతం కుర్ర హీరోలు, హీరోయిన్లు వెండి తెరపై ఘాటు సన్నివేశాలతో రెచ్చిపోతున్నారు. యువతలో ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న సల్మాన్ చిత్రాల్లో మాత్రం అలాంటి సన్నివేశాలు ఉండవు. ఈ సందేహం చాలా మంది సల్మాన్ అభిమానుల్లో ఉంది. కానీ సల్మాన్ ఖాన్ పలు సందర్భాల్లో అందుకు గల కారణాన్ని వివరించాడు. చిన్న తనంలో తనకు ఎదురైన అనుభవమే లిప్ లాక్ సన్నివేశాల్లో నటించకపోవడానికి కారణం అని తెలిపాడు.

హాలీవుడ్ చిత్రాలు చూసే సమయంలో
చిన్నపుడు తాను నా చెలెళ్లతో, సోదరులతో కలసి హాలీవుడ్ చిత్రాలు చూసేవాడిని. ఆ చిత్రాల్లో లిప్ లాక్ సన్నివేశాలు వచ్చినపుడు చాలా ఇబ్బంది పడేవాడిని. అలాంటి సన్నీవేశాల వలన ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగా ఇబ్బంది పడుతారో తెలిసింది. అందువలనే తన చిత్రాల్లో లిప్ లాక్స్ ని ఎంకరేజ్ చేయను అని సల్మాన్ తెలిపాడు.

పెద్ద విషయం కాదు
గతంలో సల్మాన్ ఖాన్ కపిల్ శర్మ షోకు హాజరైన సమయంలో సల్మాన్ ఖాన్ లిప్ లాక్స్ గురించి సరదాగా స్పందించాడు. మీ సినిమాల్లో లిప్ లాక్స్ ఎందుకు ఉండవు అని కపిల్ శర్మ ప్రశ్నించగా.. చూడు భాయ్.. లిప్ కిస్ అనేది నాకు పెద్ద విషయమేం కాదు.. అందుకే ఆన్ స్క్రీన్ లో ముద్దులు పెట్టను అని సల్మాన్ ఖాన్ తెలిపాడు.

ఆఫ్ స్క్రీన్ ఎప్పుడూ చేసేపనే
ఇటీవల కపిల్ శర్మ షోకు హాజరైన సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ దాదాపుగా ఇలాంటి సమాధానమే ఇచ్చాడు. సల్లూభాయ్ సినిమాల్లో లిప్ కిస్సులు ఉండవు. ఎందుకంటే ఆఫ్ స్క్రీన్ లో భాయ్ తరచుగా చేసే పని అదే అంటూ అర్భాజ్ ఖాన్ నవ్వులు పూయించారు. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ సూపర్ హిట్ జోడి ప్రస్తుతం భారత్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ దర్శకుడు.


Click it and Unblock the Notifications











