సల్మాన్ ఖాన్‌కు షాక్.. లారెన్స్ బిష్ణోయితో చేతులు కలిపిన మాజీ ప్రేయసి.. వైరల్‌గా హీరోయిన్ లేఖ!

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికీ హత్య తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. గుజరాత్‌లోని సబర్మతి జైలులో శిక్ష అనుభవిస్తున్న రాజస్థాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి హెచ్చరికల నేపథ్యంలో సల్మాన్‌కు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇలాంటి డేజంరస్ సిట్యుయేషన్‌లో ఆయన మాజీ ప్రియురాలు.. ప్రస్తుతం గ్యాంగ్‌స్టర్‌తో చేతులు కలిపేందుకు సిద్దం కావడం అందర్నీ షాక్ గురి చేస్తున్నది. తాజాగా సల్లూభాయ్ మాజీ లవర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ అవుతున్నది. సల్మాన్ తాజా పరిస్థితి, మాజీ ప్రియురాలు పోస్టు వివరాల్లోకి వెళితే..

1998 సంవత్సరంలో హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగు సమయంలో సల్మాన్ ఖాన్, సైఫ్ ఆలీ ఖాన్, నీలమ్, టబూ తదితరులు కృష్ణ జింకలను వేటాడిన సంఘటన సంచలనం రేపింది. ఆ వ్యవహారంలో సల్మాన్ జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తమ కమ్యూనిటీ అత్యంత పవిత్రంగా భావించే జింకలను చంపడంపై సల్మాన్ బృందంపై పగ పెంచుకొన్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌స్టార్‌గా మారారు.

Salman Khan Ex Lover Somy Ali letter to Lawrence Bishnoi Bollywood Actress Social media post goes Viral

గత కొన్నేళ్లుగా సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని బిష్ణోయ్ వార్నింగ్స్ ఇస్తున్నారు. ఇటీవల ముంబైలోని ఆయన నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్‌పై కాల్పులు కూడా జరిపారు. ఆ ఘటనలో అరెస్ట్ అయిన బిష్ణోయ్ ముఠా సభ్యుడు లాకప్‌లో మరణించడంతో ప్రతీకారం తీర్చుకొనే దిశగా బిష్ణోయ్ గ్రూప్‌ అడుగులేసింది. దాంతో సల్మాన్ సన్నిహితుడు బాబా సిద్దిఖీని కాల్చి చంపారు. ఆ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలన రేపింది.

ఓ పక్క బాబా సిద్దిఖీ హత్య, సల్మాన్‌కు హెచ్చరికల నేపథ్యంలో బాలీవుడ్ నటి సోమీ ఆలీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు సంచలనం రేపింది. గతంలో సల్మాన్‌కు మాజీ ప్రేయసి అయిన ఆమె.. జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయితో చేతులు కలిపేందుకు సిద్దం కావడం ఆసక్తికరంగా మారింది. ఆమె చేసిన పోస్టు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నది.

Salman Khan Ex Lover Somy Ali letter to Lawrence Bishnoi Bollywood Actress Social media post goes Viral

సోమీ అలీ పోస్టు పెడుతూ.. ఇది లారెన్స్ బిష్ణోయికి డైరెక్ట్ మెసేజ్. నమస్తే లారెన్స్ భాయ్.మీరు జైలు నుంచి జూమ్ కాల్స్ చేస్తున్నారని వినడమే కాదు.. చూశాను కూడా. అయితే మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఉంది. దయచేసి మీతో మాట్లాడటానికి ఎలా వీలు, వెసలుబాటు కలుగుతుందో నాకు చెప్పండి అని తన పోస్టులో పేర్కొన్నారు.

Salman Khan Ex Lover Somy Ali letter to Lawrence Bishnoi Bollywood Actress Social media post goes Viral

ఈ ప్రపంచంలో అతి సుందరమైన ప్రాంతం రాజస్థాన్ మాత్రమే. మీరు పవిత్రంగా భావించే మందిరంలో పవిత్రంగా పూజలు చేయాలని అనుకొంటున్నాను. అందుకు ముందు ఒక జూమ్ కాల్ మన మధ్య జరిగితే బాగుంటుంది. పూజ తర్వాత కొన్ని విషయాలు మీతో పంచుకొంటే బాగుంటుంది అని భావిస్తున్నాను. అది మీకు మేలు జరిగే విషయమే ఉంటుందని నమ్మండి. మీరు నాకు మొబైల్ నంబర్ పంపిస్తే.. మీకు అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్యూ అంటూ ఓ మెసేజ్ పెట్టారు. సోమీ అలీ పోస్టు రకరకాల చర్చకు దారి తీసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X