ప్లీజ్ అలా వదిలేయకు, మా హీరోను పెళ్లి చేసుకో : హీరోయిన్‌కు అభిమాని విన్నపం!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ఒకప్పుడు రిలేషన్‌షిప్ కొనసాగించారనేది బాలీవుడ్లో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. 2009కి ముందు వీరు దాదాపు నాలుగేళ్లు డేటింగ్ చేసినట్లు అప్పట్లో రకరకాలుగా చర్చించుకున్నారు.
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ విడిపోయే సమయంలో కూడా ఇద్దరి మధ్య పెద్దగా విబేధాలు ఏమీ లేవు. ఇద్దరూ స్నేహితుల్లా కొనసాగుతున్నారు. సల్మాన్ ఖాన్ ఇంట్లో జరిగే వేడుకలకు కూడా కత్రినా కైఫ్ హాజరవుతుంటారు. ఖాన్ ఫ్యామిలీ కూడా ఆమెను తమ కుటుంబ సభ్యురాలిగా ట్రీట్ చేస్తుంటారు.

ప్లీజ్ మా హీరోను పెళ్లి చేసుకో...
బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లలో ఒకరైన సల్మాన్ ఖాన్ వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుని సెటిలవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇటీవల ఇంటర్వ్యూలో కత్రినా తనకు ఎదురైన అనుభవం గురించి వివరించారు. సల్మాన్‌ను పెళ్లి చేసుకోవాలని అతడి అభిమానులు కొందరు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తనను రిక్వెస్ట్ చేసినట్లు తెలిపారు.

కత్రినా ఎలా రియాక్ట్ అయ్యారంటే..
సల్మాన్ ఖాన్ అభిమానులు అలా అడగటంతో ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక "Hmmmm..." అంటూ నిట్టూర్చిందట. ఈ విషయం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

నా పెళ్లి ఎప్పుడో నాకే తెలియదు
తన పెళ్లి గురించి కత్రినా కైఫ్ రియాక్ట్ అవుతూ.. ‘నా పెళ్లి ఎప్పుడో నిజంగా నాకు తెలియదు. ఎవరిని చూసినపుడు పెళ్లి చేసుకోవాలనే భావన కలుగుతుందో అప్పుడే చేసుకుంటాను' అని తెలిపారు.

సల్మాన్-కత్రినా
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కలిసి ప్రస్తుతం అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భారత్' చిత్రంలో నటిస్తున్నారు. కొరియా చిత్రం ‘ఓడ్ టు మై ఫాదర్' అనే చిత్రానికి ఇది రీమేక్. ఈద్ సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











