ఆ ఒక్క ట్వీట్‌తో అంతా మారింది.. సల్మాన్‌ ఖాన్‌ను మీరు ఏం చేయలేరంటూ ఫ్యాన్స్ ఫైర్

సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఘటన వేడి ఇంకా చల్లారడం లేదు. ఇప్పటికి వారం అవుతున్నా.. సుశాంత్ మరణ వార్త మాత్రం ఇంకా అందరి చెవుల్లో మార్మోగుతూనే ఉంది. ఇప్పటికే విచారణ జరుగుతున్నా.. సోషల్ మీడియా దృష్టిలో మాత్రం ఇది బాలీవుడ్ చేసిన హత్యే. ఈ మేరకు నెటిజన్స్ బాలీవుడ్, నెపోటిజం, కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, అలియా భట్, కపూర్ ఫ్యామిలీలపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో సల్మాన్‌పై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది.

అందర్నీ తొక్కేశాడు..

అందర్నీ తొక్కేశాడు..

సల్మాన్ ఖాన్ ఎందరి జీవితాలనో చిదిమేశాడని నెటిజన్లు ఆరోపించారు. వివేక్ ఒబేరాయ్, ఐశ్వర్యా రాజ్, అర్జిత్ సింగ్ ఇలా ఎంతో మందిని తొక్కేశాడని కామెంట్స్ చేశారు. పాదచారులకు కారుతో గుద్ది చంపిన విషయాన్ని, కృష్ణజింక కేసులను ఈ నేపథ్యంలో ప్రస్థావించారు. ఇక తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఫ్యాన్స్ సైతం ఫైర్ అయ్యారు.

సల్మాన్ ట్వీట్..

సల్మాన్ ట్వీట్..


తనపై వస్తున్న ఆరోపణలపై రియాక్ట్ కావొద్దంటూ అభిమానులందరిని వేడుకున్నాడు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ..‘ఇలాంటి విషాదకరమైన సమయంలో సుశాంత్ అభిమానులకు తోడుగా నిలబడండి. ఇది చాలా ఎమోషనల్ విషయం. అసభ్యకరమైన భాషతో శాపాలు పెట్టుకోవాల్సిన సమయం కాదు. అభిమానులకె కాకుండా సుశాంత్ కుటుంబానికి కూడా అండగా నిలవాలని ఇది నిజంగా చాలా బాధించే విషయమ'ని చెప్పుకొచ్చాడు.

ట్విట్టర్ వార్..

ట్విట్టర్ వార్..


గత కొన్ని రోజులుగా ట్విట్టర్‌లో పెద్ద యుద్దమే జరుగుతోంది. బాలీవుడ్ సెలెబ్రిటీలను, నెపోటిజం హీరోలను ఏకి పారేస్తున్నారు. కంగనా రనౌత్ అయితే ఏకంగా బాలీవుడ్ పెద్దలను నేరుగానే ప్రస్థావిస్తూ విమర్శలు చేస్తోంది. నెటిజన్లు కూడా సుశాంత్ మృతికి న్యాయం జరగాలని కోరుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో సల్మాన్ తన ఫ్యాన్స్‌కు ఇచ్చిన సందేశం అందర్నీ ఆకట్టుకుంటోంది.

ఏం చేయలేరంటూ..

ఏం చేయలేరంటూ..

సల్మాన్ ఖాన్‌ను ఏం చేయలేరంటూ ఫ్యాన్స్ మీడియాపై విరుచుకుపడుతూ... PresstitutesCantHarmSALMAN అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. మీడియా ఎప్పుడూ కూడా సల్మాన్‌ ఖాన్‌ను సపోర్ట్ చేయలేదని, నెగెటివ్ వార్తలనే రాస్తూ వచ్చిందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సల్మాన్ మీడియా తయారు చేసిన స్టార్ కాదని సొంతకాళ్ల మీద, అంకితభావం, ఎంతో శ్రమించి ఎదిగాడని కామెంట్స్ చేస్తున్నారు.

Recommended Video

Sushant Could Be Saved By Ankita Lokhande, Ankita ఇంటి నేమ్‌ ప్లేట్ మీద ఇప్పటికీ Sushant పేరు
ఏం రాసినా పట్టించుకోను..

ఏం రాసినా పట్టించుకోను..


ఈ నేపథ్యంలో సల్మాన్ గతంలో మీడియా గురించి మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇంట్లో కూర్చుని, డబ్బులు తీసుకునే ఆర్టికల్ రాసే వారిని పట్టించుకోనని, అది మంచి గురించి రాసినా, చెడు గురించి రాసినా తాను పట్టించుకోనని పేర్కొన్న వీడియో తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X