మట్టి మనిషిగా మారిన సల్మాన్.. రైతులను గౌరవించండన్న భాయ్
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ముంబై నగరానికి దూరంగా ప్రకృతి ఒడికి దగ్గరగా నివసిస్తూ ఉన్నాడు. పన్వేల్ ఫాంహౌస్‌లో సల్మాన్ ఈ లాక్ డౌన్ సమయాన్ని గడిపేస్తున్నాడు. సల్మాన్ తన ప్రేయసి లూలియా వాంటూర్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌లతొ తన ఫాంహౌస్‌లో ఉంటున్నాడు. షూటింగ్‌లో భాగంగా అక్కడి వెళ్లి అటే చిక్కుకుపోయారు. అయితే అక్కడ మాత్రం ఖాళీగా ఎందుకు ఉండటమని ఓ అదిరిపోయే ఆల్బమ్‌ను కూడా రిలీజ్ చేశారు.
తేరే బినా అంటూ సల్మాన్ రాసిన పాటను అక్కడి అందాలతో కట్టిపడేసి అద్భుతంగా చిత్రీకరించారు. జాక్వెలిన్ అందాలు సైతం ఆ ఆల్బమ్‌కు అదనపు ఆకర్షణగా నిలిచాయి. అయితే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ రైతుగా మారినట్టు కనిపిస్తోంది. పోలంగట్లపై తిరుగుతూ అచ్చమైన రైతుగా మారిపోయాడు. తినేవాడి పేరు మెతుకుపై ఉంటుందని సల్మాన్ చెప్పిన కొటేషన్ కూడా అదిరిపోయింది.

తాజాగా సల్మాన్ మరో ఫోటోను షేర్ చేశాడు. ఒళ్లంతా మట్టితో నిండగా.. రైతులను గౌరవించాలనే విషయం అర్థమైనట్టుంది భాయ్‌కి. పొలం పనుల్లో ఉన్న కష్టాన్ని తెలుసుకున్న సల్మాన్.. వారిని గౌరవించాలని చెప్పుకొచ్చాడు. సుశాంత్ మరణించడం సల్మాన్‌పై నెటిజన్స్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. తనపై వచ్చిన ట్రోల్స్‌పై భాయ్ స్పందిస్తూ.. విషాదకరమైన సమయంలో సుశాంత్ అభిమానులకు తోడుగా నిలబడండని, ఇది చాలా ఎమోషనల్ విషయం. అసభ్యకరమైన భాషతో శాపాలు పెట్టుకోవాల్సిన సమయం కాదని అభిమానులకు సందేశాన్నిచ్చిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











