Salman Khan: నీ కొడుకును ఖతం చేస్తాం: సల్మాన్ ఖాన్ తండ్రికి టెర్రరిస్ట్ వార్నింగ్..
Salman Khan: బాలీవుడ్ నుంచి ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మరోసారి సల్మాన్ ఖాన్ కుటుంబాన్ని భయపెట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఈ సారి సల్మాన్‌కు కాకుండా ఆయన తండ్రి ప్రముఖ రచయిత సలీంఖాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. అది కూడా బహిరంగంగా.. సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో బురఖా ధరించిన ఓ మహిళ అతడిని బెదిరించింది.
వివరాల్లోకి వెళితే.. సల్మాన్ తండ్రి సలీం ఖాన్ గురువారం ఉదయం యథావిధిగా మార్నింగ్ వాక్ చేస్తున్నాడు. ఈ తరుణంలో ఓ వ్యక్తి, బురఖా ధరించిన మహిళ స్కూటీపై అతని వద్దకు వచ్చి, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు చెబుతూ బెదిరించారు. సరిగ్గా ప్రవర్తించడం తెలుసుకో.. లేదంటే లారెన్స్ బిష్ణోయ్‌ని పంపాలా?' అంటూ బెదిరించింది . ఈ విషయం తన తండ్రి తెలుసుకున్న సల్మాన్ ఖాన్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో స్కూటీ నంబర్ 7444 గా గుర్తించారు. స్కూటర్ నడుపుతున్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ ఫొటోలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి, బురఖా ధరించిన మహిళ కనిపించారు. ఇదిలా ఉండగా సల్మాన్ గత రాత్రి సినిమా షూటింగ్ విదేశాలకు వెళ్లారు. త్వరలో విడుదల కాబోతున్న 'సికిందర్' సినిమా షూటింగ్‌కి సంబంధించి సల్మాన్ విదేశాలకు వెళ్లినట్టు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ నగరంలో లేని సమయంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తన తండ్రి సలీం ఖాన్‌ను బెదిరించడం భాయిజాన్ అభిమానులను కలవరపడుతున్నారు. అయితే. సల్మాన్ ఖాన్ కుటుంబాన్ని ఓ గ్యాంగ్‌స్టర్ బెదిరించడం ఇదే మొదటిసారి కాదు. ఏళ్ల తరబడి ఈ ట్రెండ్ కొనసాగుతోంది.
బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ పై దాడి చేయాలని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చాలా ఏళ్లుగా ప్లాన్ చేస్తోంది. వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్.. సల్మాన్‌ను చంపాలని చాలాసార్లు ప్రకటించారు. ఆ గ్యాంగ్ ప్రయత్నాలు ఫలించలేదు. గతంలో ముంబైలో సల్మాన్‌పై దాడి చేసేందుకు తన షూటర్లను పంపాడు లారెన్స్ బిష్ణోయ్. ఈ మోస్ వాంటెండ్ గ్యాంగ్‌స్టర్ ముఠాలోని సంపత్ నెహ్రా 2018 లో దాడికి ప్రయత్నించి.. హర్యానా పోలీసులకు పట్టుబడ్డారు. ఈ సమయంలో విచారించగా.. సల్మాన్ ఖాన్‌పై దాడికి సంబంధించిన ప్లాన్స్ వెలుగులోకి వచ్చాయి.
2024 జనవరిలో పన్వెల్‌లోని సల్మాన్ ఫామ్‌హౌస్‌లోకి ఇద్దరు దుండగులు ప్రయత్నించారు. ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ను తొలగించి.. లోపలికి వెళ్లబోతుండగా భద్రతా సిబ్బంది వారిని పట్టుకున్నారు. అంతకుముందు.. సల్మాన్‌కు మార్చి 18, 2023 న బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. అందులో గోల్డీ బ్రార్ సల్మాన్‌తో ముఖాముఖి మాట్లాడాలనుకుంటున్నట్లు రాశారు. అదే ఏడాది ఏప్రిల్ 10న మరో బెదిరింపు కాల్ వచ్చింది. ఆ ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి ఏప్రిల్ 30న సల్మాన్ ఎలిమినేట్ అవుతారని వార్నింగ్ ఇచ్చారు. గ్యాంగ్ స్టార్ గోల్డీ బ్రార్ ఒపెన్ గానే వార్నింగ్ ఇచ్చారు. ఓ వీడియోలో మాట్లాడుతూ.. సల్మాన్ తన టార్గెట్ అని, అవకాశం వస్తే.. ఖచ్చితంగా సల్మాన్ ని చంపేస్తానని బెదిరించారు.

ఇంతకీ సమస్యేంటీ..?
1998 నుంచి సల్మాన్, లారెన్స్ మధ్య వివాదం నడుస్తోంది. అదే ఏడాది జింకల వేట కేసులో సల్మాన్ పేరు తెరపైకి వచ్చింది. అప్పటి నుంచి బిష్ణోయ్ వర్గాల్లో సల్మాన్‌పై వ్యతిరేకత కొనసాగుతోంది. లారెన్స్ ప్రకారం.. వారి ఆచారం ప్రకారం జింకలను దేవుడిలా భావిస్తారు. కృష్ణ జింకలను పూజిస్తారు. కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ పేరు రావడంతో గ్యాంగ్‌స్టర్ సల్మాన్‌ను బెదిరించడం మొదలుపెట్టాడు.
ప్రస్తుతం గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సబర్మతి సెంట్రల్ జైలులో హై సెక్యూరిటీ వార్డులో ఉన్నాడు. కానీ, ఈ గ్యాంగ్ స్టార్ మాత్రం జైలులో ఉన్నా బయటా తాను చేయాలని భావించింది చేస్తాడు. జైల్లో కూర్చునే కోట్లాది రూపాయలు రికవరీ చేస్తాడు. ఈ విషయాలు NIA విచారణ సమయంలో వెలుగులోకి వచ్చాయి.
తన గ్రూప్ విషయాలను ఆయన వెల్లడించినట్టు టాక్.
సిద్ధూ మూసేవాల హత్యతో సంబంధం
పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు స్కెచ్ వేసింది కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగే.. ఇప్పటికే లారెన్స్ బిష్ణోయ్, అతని సహచరుడు గోల్డీ బ్రార్ సిద్ధూ మూసేవాలాను హత్య చేసినట్లు స్పష్టమైంది. అయితే, విచారణ సమయంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్యాంగ్ స్టార్ లారెన్స్ తన భాగస్వామి గోల్డీ బ్రార్‌కు దాదాపు రూ. 50 లక్షలు పంపాడని, ఈ డబ్బు మొత్తం హత్య కుట్రను అమలు చేయడానికి ఉపయోగించిందని చెప్పాడు. ఈ హత్యకు గోల్డీ బ్రార్ ఇప్పటికే బాధ్యత వహించాడు.


Click it and Unblock the Notifications











