ఫస్ట్ లవర్ కోసం సల్మాన్ టెంపర్.. స్టార్ హీరోతో సెట్లోనే ఫైట్!

సినీ పరిశ్రమలో తారల మధ్య అఫైర్లు, రూమర్లు ఎక్కువగానే వినిపిస్తాయి. బాలీవుడ్‌లో అయితే ఆ గోల ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే సల్మాన్ ఖాన్ అఫైర్ల విషయంలో గతంలో ఇలాంటి రూమర్లు బాగానే కనిపించాయి. అయితే తన మొదటి లవర్ సంగీత బిజ్లానీ విషయంలో సల్మాన్ గొడవ పడిన విషయం అప్పట్లో దుమారం లేపింది. అయితే ఆ తర్వాత అసలు విషయం తెలుసుకోని ఇద్దరూ చల్లబడ్డారనేది తాజా విషయం. అప్పటి గొడవ విషయంలో ఏం జరిగిందంటే..

Recommended Video

Salman Khan Clash with Jackie Shroff for Sangeeta Bijlani Now Goes Viral
సల్మాన్ ఖాన్‌తో జాకీ ష్రాఫ్

సల్మాన్ ఖాన్‌తో జాకీ ష్రాఫ్

ప్రస్తుతం దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వంలో రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ అనే సినిమాలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, సల్మాన్ ఖాన్ కలిసి నటిస్తున్నాడు. ఈ క్రమంలో గతంలో వారిద్దరి మధ్య చోటుచేసుకొన్న గొడవలను పక్కన పెట్టేశారనేది తాజా సమాచారం. సల్మాన్, జాకీ ఇద్దరు మంచి మిత్రులుగా కనిపించారట. సంగీత బిజ్లానీ గురించి జరిగిన గొడవ ఇప్పుడు మీడియాలో మరోసారి చర్చనీయాంశమైంది.

సంగీతాతో జాకీ డేటింగ్

సంగీతాతో జాకీ డేటింగ్

సల్మాన్ ఖాన్‌కు ఫస్ట్ లవర్ ఎవరంటే సంగీత బిజ్లానీ అనే విషయాన్ని అందరు చెప్పేస్తారు. అయితే సల్మాన్ ఖాన్‌తో డేటింగ్ చేస్తున్న సమయంలో సంగీత జాకీ ష్రాఫ్‌తో నటించింది. జాకీ, సంగీత కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఆమోద ముద్ర వేశారు. అయితే సంగీతతో జాకీ డేటింగ్ విషయం సల్మాన్‌కు ఆగ్రహం తెప్పించిందంట. దాంతో ఒకరిపై మరొకరు కారాలు, మిరియాలు నూరుకొన్నారు.

బంధన్ సినిమా సెట్లో ఫైట్

బంధన్ సినిమా సెట్లో ఫైట్

ఇక అలాంటి టెన్షన్ పరిస్థితుల్లో సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్ బంధన్ అనే చిత్ర షూటింగ్‌లో ఎదురుపడ్డారు. వారిద్దరి మధ్య మాటా మాట పెరిగి ఇద్దరి మధ్య గొడవకు దారి తీసిందట. అలాగే వారిద్దరు ఓ రేంజ్‌లో ఫైట్ చేయడానికి సిద్ధం కావడంతో ఇద్దరు స్నేహితులు సన్నిహితులు చల్లబరిచారట. దాంతో ఆ గొడవ అంతటితో ఆగిపోయింది.

రూమర్లకు చెక్ చెప్పిన సంగీతా

రూమర్లకు చెక్ చెప్పిన సంగీతా

జాకీ, సల్మాన్ గొడవ జరుగుతుండగానే సంగీత బిజ్లానీ బంధన్ సెట్స్‌లోకి వచ్చి.. అఫైర్, డేటింగ్ విషయాల్లో వాస్తవం లేదు. అదంతా మీడియా అసత్య ప్రచారమని క్లియర్‌గా చెప్పడంతో సల్మాన్ ఖాన్ కూడా శాంతించారట. దాంతో తనకు, జాకీ మధ్య వస్తున్న గాసిప్స్‌కు కూడా సంగీత బిజ్లానీ తెర వేసిందని చెప్పుకొంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X