Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సల్మాన్ ఖాన్ ఫస్ట్ లిప్‌లాక్.. వెండితెరపై దిశా పటానీకి తొలి ముద్దు.. రాధే అలా నిరసనలు
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రాధే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రతీ ఏడాది ఈద్ రోజున అభిమానులను తన సినిమాతో పలకరించే సల్లూ భాయ్ ఇప్పుడు కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల రిలీజైన రాధే చిత్రం ట్రైలర్ సోషల్ మీడియాలో హల్చల్ రేపుతున్నది. అయితే సల్మాన్ ఖాన్ తన కెరీర్లో ఎన్నడూ లేని విధంగా తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై లిప్ లాక్ చేయడం చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే..
రొమాంటిక్ సీన్లతో అదరగొడుతూ..
తన సినిమాల్లో స్టైల్, డైలాగ్స్, యాక్షన్స్, రొమాంటిక్ సీన్లతో అదరగొట్టే సల్మాన్ ఖాన్ ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కు కాస్త దూరంగానే ఉంటారు. తెర మీద హీరోయిన్లతో లిప్‌లాక్స్‌కు వ్యతిరేకంగా కనిపిస్తారు. పలు మార్లు తాను లిప్‌లాక్‌కు వ్యతిరేకం అని చెప్పారు.
తన నైజానికి విరుద్ధంగా సల్మాన్
అయితే రాధే ట్రైలర్లో అందుకు విరుద్దంగా సల్మాన్ ఖాన్ కనిపించడం అభిమానుల్లో హుషారు కలిగిస్తే.. సినీ వర్గాలకు ఓ రకమైన చర్చను లేవనెత్తింది. సల్మాన్ ఖాన్ లిప్‌లాక్ చేయడానికి ప్రేరేపించిన అంశాలు ఏమిటి అనే ప్రశ్నలను సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకొంటున్నారు.
దిశా పటానీతో సల్మాన్ ఖాన్ చేసిన లిప్‌లాక్
రాధే ట్రైలర్లో తాను పెట్టుకొన్న నియమాలకు విరుద్దంగా దిశా పటానీతో సల్మాన్ ఖాన్ చేసిన లిప్‌లాక్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో ఇంతకు ముందు ఏ హీరోయిన్ను ముద్దు పెట్టుకోవడానికి ఇష్టపడని సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఎందుకు తన నిర్ణయాన్ని మార్చుకొన్నారనే విషయం ఆసక్తిగా మారింది.
తొలి ఆన్ స్క్రీన్ ముద్దు కోసం ఫ్యాన్స్
ఇక సల్మాన్ ఖాన్ తొలి ఆన్ స్క్రీన్ ముద్దును చూసేందుకు అభిమానులు తహతహలాడుతున్నారు. ప్రస్తుతం రాధే ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. ఈ సినిమాలో డైలాగ్స్, యాక్షన్ సీన్లకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక దిశా పటానీ గ్లామర్, అందాల ఆరబోత కూడా ట్రైలర్ హైలెట్ అయంది.
ఓటీటీ రిలీజ్‌పై నిరసనలు
గతంలో ఎన్నడూ లేని విధంగా సల్మాన్ ఖాన్ నటించిన రాధే చిత్రం ఒకేసారి థియేటర్లలోను, ఓటీటీలోను రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను ఈద్ కానుకగా జీప్లెక్స్‌లో ప్రసారం చేయనున్నారు. అయితే ఓటీటీలో రిలీజ్ చేయడంపై థియేటర్ యాజమాన్యాలు నిరసన తెలుపుతున్నారు.