twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కత్రినాకైఫ్ పెళ్లి పై సల్మాన్ ఖాన్ మొదటి రియాక్షన్.. ఆమెను పట్టుకొని ఎమోషనల్ అవుతూ..

    |

    బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన స్టార్ హీరో సల్మాన్ ఖాన్. ఇక ఆయన పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోతారు అని గతంలో చాలా రాకల కామెంట్స్ వచ్చాయి. ఇక అలాంటి కామెంట్స్ ఎన్ని వచ్చినా కూడా సల్మాన్ వాటిని చాలా కామెడీగా తీసుకుంటూ సోలో లైఫ్ సో బెటర్ అన్నట్లుగా ఎంజాయ్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక గతంలో సల్మాన్ - కత్రినా మధ్య లవ్ ట్రాక్ , బ్రేకప్ కొనసాగినట్లు వార్తలు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే రీసెంట్ గా కత్రినా కైఫ్, విక్కీ కౌషల్ ను పెళ్లి చేసుకోవడంతో మొదటిసారి బుల్లితెరపై సల్మాన్ ఓపెన్ గా స్పందించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

    Recommended Video

    Katrina Kaif, Vicky Kaushal Wedding Specials From Mehendi To Food Menu || Filmibeat Telugu
     చాలా కామెడీగా..

    చాలా కామెడీగా..

    బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఏ విషయాన్ని అయినా సరే ఎంత వరకు తీసుకువాలో అంత వరకే తీసుకుంటాడు అనేది బాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికి తెలిసిన విషయమే. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెరపై హోస్ట్ గా కూడా చేస్తున్న సల్మాన్ అప్పుడప్పుడు తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలపై కూడా చాలా కామెడీగా స్పందిస్తూ ఉంటాడు. ఎవరైనా కామెంట్ చేసినా కూడా పెద్దగా పట్టించుకోడు.

    పెళ్లి చేసుకోకపోవడానికి కారణం..

    పెళ్లి చేసుకోకపోవడానికి కారణం..

    ఇక సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోకుండా ఉండడానికి గతంలో జరిగిన కొన్ని బ్రేకప్స్ కారణం అని చెబుతుంటారు. గతంలో కత్రినా కైఫ్ తో కూడా సల్మాన్ చాలా క్లోజ్ గానే ఉన్నాడు. వీరి బంధం గురించి అప్పట్లో ఎన్నో కథనాలు వేలువడ్డాయి. వెండితెరపై కాంబినేషన్ సక్సెస్ అవ్వడమే కాదు. బయట ప్రపంచంలో కూడా ఎక్కడ కనిపించినా కెమెరాలన్ని వారి వైపే తిరిగేవి. ఇక వీరు పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు అప్పట్లో టాక్ వచ్చింది.

     హీరోతో కత్రినా పెళ్లి..

    హీరోతో కత్రినా పెళ్లి..

    ఇక ఏమైందో ఏమో గాని హఠాత్తుగా సల్మాన్ ఖాన్ బ్రేకప్ చెప్పినట్లు అప్పట్లోనే క్లారిటీ వచ్చేసింది. ఇక రణ్ బీర్ కపూర్ కత్రినా మధ్య కొన్నేళ్ల పాటు ప్రేమాయణం గట్టిగానే కొనసాగింది. ఇక ఆ తరువాత కత్రినా కైఫ్ అతనికి కూడా బ్రేకప్ చెప్పేసి యువ హీరో విక్కీ కౌషల్ తో మరో ట్రాక్ ను స్టార్ట్ చేసింది. ఇక వీరు గత ఏడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

    మంచి స్నేహితులుగా..

    మంచి స్నేహితులుగా..

    విక్కీ కౌషల్, కత్రినా కైఫ్ పెళ్లి చేసుకున్నారు అనగానే అప్పుడు సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ పేరు కూడా వైరల్ అయ్యింది. అంతే కాకుండా వారి పెళ్లి కోసం సల్మాన్ ఖాన్ ప్రత్యేకంగా సెక్యూరిటీ కోసం తన బాడీ గార్డ్స్ ను కూడా పంపినట్లు టాక్ వచ్చింది. ఇక పెళ్లి సమయంలో సల్మాన్ కత్రినా పై పెద్దగా స్పందించలేదు. కానీ వారు ఇద్దరు కూడా ప్రస్తుతం మంచి స్నేహితులుగా ఉన్నారని అర్ధమవుతోంది.

    సల్మాన్ ఎమోషనల్

    సల్మాన్ ఎమోషనల్

    కంటెస్టెంట్‌లలో ఒకరైన షెహనాజ్ గిల్ సల్మాన్ తో జోడిగా హోస్ట్‌గా మారారు. ఇక గత ఏడాది సెప్టెంబర్‌లో మరణించిన సిద్ధార్థ్ శుక్లాను షెహ్నాజ్ ను గుర్తు చేసుకోవడంతో సల్మాన్ షెహనాజ్‌ను గట్టిగా కౌగిలించుకుని ఎమోషనల్ అయ్యాడు. అందుకు సంబంధించిన మూమెంట్స్ అందరిని కంటతడి పెట్టించాయి. ఇక కొద్దిసేపటికి వారు 'చిక్నీ చమేలీ' పాటకు సరదాగా డ్యాన్స్ చేశారు.

    కత్రినా పెళ్లిపై సల్మాన్ రియాక్షన్..

    కత్రినా పెళ్లిపై సల్మాన్ రియాక్షన్..

    ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.. నటి కత్రినా కైఫ్‌ పెళ్లి చేసుకున్న సందర్భంగా మొదటిసారి అభినందించడం విశేషం. పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో ఈ ఘటన చోటుచేసుకుంది. బిగ్ బాస్ 13వ సీజన్ చివరి ఎపిసోడ్ లో సల్మాన్ ఖాన్ వారి గురించి చాలా సెన్సిటివ్ గా కాంట్రవర్సీ కాకుండా వివరణ ఇవ్వడం విశేషం.

     అందరూ సంతోషంగా ఉన్నారు..

    అందరూ సంతోషంగా ఉన్నారు..

    ఇక షెహ్నాజ్ సల్మాన్‌ గురించి సరదాగా మాట్లాడుతూ.. కత్రీనా వివాహం చేసుకున్నప్పటి నుండి పంజాబ్ కత్రినాగా మారింది.. అంటూ సరదాగా కామెంట్ చేయడంతో.. దీనికి సల్మాన్ బదులిస్తూ అవును.. ఆమె విక్కీ కౌశల్‌ని వివాహం చేసుకుంది. అందరూ సంతోషంగా ఉన్నారు అంటూ కొంటెగా ఆన్సర్ ఇచ్చాడు. అప్పుడు షెహ్నాజ్, "సార్, మీరు సంతోషంగా ఉండండి" అని కామెడీగా అనడంతో.. సల్మాన్ ఎల్లప్పుడూ సంతోషంగా కనిపిస్తాడనే విధంగా ఆన్సర్ ఇచ్చాడు.

    English summary
    Salman khan first reaction on katrina kaif wedding
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X