సల్మాన్ ఖాన్ మొదటి సినిమా అట్టర్ ఫ్లాప్.. రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారో తెలుసా?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అంటే బాక్సాఫీస్‌కు కేరాఫ్ అడ్రస్. సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా కాసుల వర్షం కురువాల్సిందే. కానీ కెరీర్ తొలినాళ్లలో ప్రాధాన్యత లేని పాత్రతో కెరీర్ ఆరంభించారు. కానీ కెరీర్ ప్రారంభంలోనే బ్లాక్‌బస్టర్ హిట్‌తో తన సినీ వారస్వత్వాన్ని నిరూపించుకొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 33 ఏళ్లుగా బాలీవుడ్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదురే లేకుండా తన సినీ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పడు వందల కోట్లలో రెమ్యునరేషన్ తీసుకొంటున్న సల్మాన్ ఖాన్ తొలి సినిమాకు మొదటి జీతం ఎంతో తెలుసా? అనే వివరాల్లోకి వెళితే.

సల్మాన్ ఖాన్ ఫస్ట్ మూవీ

సల్మాన్ ఖాన్ ఫస్ట్ మూవీ

సల్మాన్ ఖాన్ నట జీవితం 1988లో బీవీ హోతో ఐసీ అనే చిత్రంతో ప్రారంభమైంది. ఈ చిత్రంలో రేఖ, ఫారుఖ్ షేక్, బిందు తదితరులు నటించారు. అయితే ఈ చిత్రంలో ఫారుఖ్ షేక్‌కు సోదరుడిగా సల్మాన్ ఖాన్ నామమాత్రమైన పాత్రకే పరిమితమయ్యారు. అయితే ఆ సినిమా సల్మాన్‌కు పెద్దగా గుర్తింపు తీసుకురాకపోవడంతో కొంత అసంతృప్తికి లోనయ్యారట.

మైనే ప్యార్ కియా మూవీతో

మైనే ప్యార్ కియా మూవీతో

ఆ తర్వాత 1989లో ప్రముఖ నిర్మాత సూరజ్ బరత్యాజా రూపొందించిన మైనే ప్యార్ కియా సినిమా రిలీజ్ కావడం, దేశవ్యాప్తంగా యూత్‌, ఫ్యామిలీ అనే తేడా లేకుండా ఆకట్టుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించింది. దాంతో ఓవర్‌నైట్‌తోనే అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. నిర్మాతలకు కోట్లు కురిపించే హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత సల్మాన్ కెరీర్‌కు ఎదురే లేకుండా పోయింది.

ప్రపంచవ్యాప్తంగా అభిమానులు

ప్రపంచవ్యాప్తంగా అభిమానులు

సల్మాన్ ఖాన్‌కు దేశంలోనే కాదు విదేశాల్లోకూడా అసంఖ్యాక మంది అభిమానులు ఉన్నారు. ఇటీవల తన మేనల్లుడితో కలిసి రష్యాలో పర్యటించగా.. అక్కడ అభిమానులు సల్మాన్‌కు బ్రహ్మరథం పట్టారు. సల్మాన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా తన స్టార్ స్టామినాకు అద్దం పట్టాయి.

తొలి సినిమాకు పారితోషికం ఎంతంటే

తొలి సినిమాకు పారితోషికం ఎంతంటే

అయితే ఇంతటి క్రేజ్ ఉన్న సల్మాన్ ఖాన్ తన మొదటి సినిమా కోసం చాలా తక్కువ మొత్తంలో రెమ్యునరేషన్‌ను అందుకొన్నాడు. తనకు కేవలం 11 వేల రూపాయలు మాత్రమే పారితోషికంగా ఇచ్చారు. ఆ పాత్ర చిన్నది కావడంతో అంతే అనుకొని తీసుకొన్నాను. అంతేకాకుండా తనకు అది తొలి చిత్రం కావడంతో పెద్దగా డిమాండ్ కూడా చేయాల్సిన పరిస్థితి లేదు అంటూ సల్మాన్ ఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Recommended Video

Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
సల్మాన్ ఖాన్ కెరీర్ ఎలా ఉందంటే..

సల్మాన్ ఖాన్ కెరీర్ ఎలా ఉందంటే..

సల్మాన్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే... లాక్‌డౌన్‌కు ముందు దంబాంగ్ 3, లాక్‌డౌన్ తర్వాత రాధే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం అంతిమ్: ది ఫైనల్ ట్రూత్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తన ప్రియ మిత్రుడు, బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కోసం లాల్ సింగ్ చద్దా చిత్రంలో ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఇటీవల బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ గజ్జర్ నటించిన కాగజ్ అనే చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ చిత్రానికి మంచి స్పందన కూడా ఓటీటలో వ్యక్తమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X