For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Salman khan: సొంత స్నేహితులే నా ప్రేయసితో ఎఫైర్.. బ్రేకప్ స్టోరీని నవ్వుతూ చెప్పిన సల్మాన్ ఖాన్!

  |

  ఇండియా మొత్తంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా గుర్తింపు అందుకున్న నెంబర్ వన్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అని అందరికి తెలిసిన విషయమే. సూపర్‌ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రతిసారి కూడా ఎవరో ఒకరితో రిలేషన్ లో ఉన్నాడని నిత్యం వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటాడు. తన మూడు దశాబ్దాల కెరీర్‌లో సల్మాన్ అనేక మంది నటీమణులతో లవ్ ట్రాక్ ను కొనసాగించినట్లు టాక్ గట్టిగానే వచ్చింది. ఇక సల్మాన్ ఖాన్ ఎక్కడికి వెళ్లినా కూడా మీడియా నుంచి ఎదురయ్యే మొదటి ప్రశ్న అతని వివాహం గురించే. అంతే కాకుండా రియాలిటీ షోలలో కూడా సల్మాన్ పెళ్లి విషయంపై అనేక రకాల ప్రశ్నలను ఎదుర్కొనేవారు. కానీ సల్మాన్ ఎప్పుడు కూడా ఆ విషయంలో పెద్దగా కంగారు పడలేదు. చాలా ఫ్రీగానే నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఇక సల్మాన్ ఒక లవ్ స్టొరీ పై కూడా ఒక షోలో క్లారిటీ ఇచ్చారు. ఆ ఓల్డ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  ఎన్నో లవ్ ట్రాక్స్..

  ఎన్నో లవ్ ట్రాక్స్..

  సల్మాన్ ఖాన్ జీవితం గురించి దాదాపు అందరికీ తెలిసిందే. అతను ఎంత సీక్రెట్ గా ఉంచినా కూడా కొన్ని విషయాలు మాత్రం చాలా ఈజీగా లీక్ అయిపోయాయి. ముఖ్యంగా అతని ప్రేమ వ్యవహారాలు అయితే చాలానే లీకయ్యాయి. ఒక సీనియర్ హీరోయిన్ తో లవ్ ట్రాక్ ను గట్టిగా నడిపినట్లు టాక్ అయితే వచ్చింది. ఇక ఆ తర్వాత కత్రినా కైఫ్ తో అతను చాలా కాలం పాటు ప్రేమలో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. వారి రిలేషన్ పై ఎన్ని రూమర్స్ వచ్చిన కూడా సల్మాన్ ఖాన్ ఏ రోజు వాటిని పట్టించుకోలేదు.

  కత్రినా కైఫ్ తరువాత..

  కత్రినా కైఫ్ తరువాత..

  కత్రినా కైఫ్ తో బ్రేకప్ అనంతరం సల్మాన్ ఖాన్ అమ్మాయిలకు చాలా కాలం పాటు దూరంగానే ఉన్నాడు. సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ సోలో లైఫ్ ను హ్యాపీ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక మధ్య మధ్యలో కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్ తో ఉన్నాడని అలాగే కొంతమంది స్టార్ హీరోయిన్స్ తో కూడా క్లోజ్ గా ఉన్నట్లు టాక్ వచ్చింది. అయితే ప్రేమ పెళ్లి అనే వ్యవహారాలు మాత్రం తనవరకు రానివ్వలేదు. ఇటీవల శ్రీలంక న్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండెజ్ తో స్పెషల్ రిలేషన్ ను మెయింటైన్ చేస్తున్నట్లు టాక్ వచ్చింది.

  చాలా కామెడీగా

  చాలా కామెడీగా

  ఇక ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కు సంబంధించిన ఒక పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో సల్మాన్ ఖాన్ తన పాతకాలపు ప్రేమకథను చాలా కామెడీగా చెప్పడం విశేషం. ఒక అమ్మాయిని ప్రేమించినట్లు అంగీకరించాడు. అయితే ఆ అమ్మాయికి ఇప్పుడు పెళ్లయిందని, అమ్మమ్మగా మారిందని తర్వాత అతను వెల్లడించాడు.

   ఒకప్పుడు జరిగిన లవ్ స్టొరీ

  ఒకప్పుడు జరిగిన లవ్ స్టొరీ


  అజయ్ దేవగన్, అతని భార్య మరియు కాజోల్‌తో బిగ్ బాస్ 13లో గేమ్ ఆడుతున్నప్పుడు సల్మాన్ ఖాన్ కుర్చీలో కూర్చుని ఉన్నాడు. సల్మాన్‌ను ఎప్పుడైనా ఒక అమ్మాయిని ఇష్టపడి ఆ తరువాత ఆమెతో ఒప్పుకోలేదా అని అడిగినప్పుడు తన చిన్నతనంలో అలా ఒకటి జరిగిందని చెప్పాడు. కానీ అది వర్కౌట్ కానందుకు బ్రతికిపోయాను అని కామెడీగా చెప్పాడు. ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడమని అజయ్ అడిగినప్పుడు మొదట సల్మాన్ నో ఛాన్స్ అని అన్నాడు. కానీ ఆ తరువాత ఆ స్టోరీని కంటిన్యూ చేశాడు.

  నా స్నేహితులు ఆమెతో ఎఫైర్

  నా స్నేహితులు ఆమెతో ఎఫైర్

  సల్మాన్ ఆ అమ్మాయిని నిజంగానే ఇష్టపడినినట్లు వెల్లడించాడు. కానీ తిరస్కరించబడతాననే భయంతో చెప్పలేదట. ఇక తనకు అప్పట్లో ఉన్న ముగ్గురు స్నేహితులు కూడా ఆమెతో అంతకుముందు ఆ తరువాత కూడా ఎఫైర్ కూడా కొనసాగించారు అని సల్మాన్ నవ్వుతూ చెప్పాడు. ఆమె నన్ను ఇష్టపడిందని నాకు తరువాత తెలిసింది. ఇక ఆమెతో కనెక్ట్ అవ్వనందుకు నేను సంతోషిస్తున్నాను.

  Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
   ఇప్పుడు ఆమెకు మనవడు

  ఇప్పుడు ఆమెకు మనవడు


  ఆ మహిళ ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని సల్మాన్ మరింత కామెడీగా చెప్పాడు. నేను 10-12 సంవత్సరాల క్రితం ఈ అమ్మాయిని మళ్ళీ కలిసినప్పుడు ఆమె అమ్మమ్మగా కనిపించింది. ఆమె నన్ను గుర్తు పట్టవా అని కూడా అడిగింది. ఇక ఆమె మనవడు, మనవరాళ్లు కూడా ఉన్నారని నీకు వాళ్ళు పెద్ద ఫ్యాన్స్ అని కూడా ఆమె చెప్పినట్లు సల్మాన్ ఖాన్ కామెడీగా చెప్పడంతో అజయ్, కాజోల్ ఇద్దరు కూడా పగలబడి నవ్వారు.

  English summary
  Salman khan funny comments on his old love story,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X