‘31 ఏళ్ల గ్యాప్ ఉంటే ఏంటి? రష్మిక కూతురుతో కూడా నటిస్తా?’

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ చిత్రం ఈద్‌కు విడుదలయ్యేందుకు ముస్తాబైంది. దక్షిణాది దర్శకుడు ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రంజాన్ పండుగ కానుకగా మార్చి 30 తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రష్మిక మందన్న హీరోయిన్లుగా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ తదితరులు కనిపించనున్నారు. ఈ సినిమా గురించిన విశేషాలు, ముంబైలో జరిగిన ఈవెంట్ గురించిన వివరాల్లోకి వెళితే..

సికందర్ సినిమా విషయానికి వస్తే.. నాడియావాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. 2.30 గంటల నిడివి ఉన్న ఈ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్‌లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొన్నది.

Salman Khan Funny Reaction on Age gap with Rashmika Mandanna

సల్మాన్ ఖాన్ స్నేహితుడు ప్రముఖ నిర్మాత సాజిద్ నాడియావాలా నిర్మించిన ఈ చిత్రానికి సౌత్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్, సినిమాటోగ్రాఫర్ తిరు పనిచేశారు. ఇక ఈ సినిమాను సుమారుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాను సుమారుగా 7000 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా పాటలు విడుదలై ఫ్యాన్స్‌కు సూపర్‌గా కిక్కెస్తున్నాయి. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరును మరింత పెంచారు. సల్మాన్, రష్మిక, కాజల్‌ కలిసి ప్రమోషన్స్‌ను మరింత ముందుకు తీసుకెళ్లున్నాడు. ఈ క్రమంలోనే ముంబైలో ఈ ప్రమోషనల్ ఈవెంట్ జరిగింది. ఈవెంట్‌ల్ మీడియాకు సల్లూభాయ్ చురకలు అంటించారు.

ఈ మధ్య కాలంలో రష్మిక వయసు గురించి సల్మాన్ ఖాన్‌ను బాలీవుడ్ మీడియా ట్రోల్ చేసింది. సల్మాన్‌కు రష్మికకు 31 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. ఆయన పక్కన రష్మిక నటించడమేమిటి? అంటూ మీడియాలోను ఆర్టికల్స్, సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. తన దృష్టికి వచ్చిన వార్తలపై సల్మాన్ ఖాన్ బహిరంగంగానే ఘాటుగా స్పందించారు.

ముంబైలో జరిగిన ఈవెంట్‌లో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. అనవసరమైన విషయాల్లో నా వెనుక పడుతుంటారు. హీరో, హీరోయిన్లకు 31 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. హీరోయిన్‌కు, ఆమె తండ్రికి ఎలాంటి సమస్య లేనప్పుడు? మీకెందుకు ఆ ప్రాబ్లెం అంటూ మీడియాకు చురకలు అంటించారు. రష్మికకు పెళ్లి జరిగి, పిల్లలు పుట్టిన తర్వాత కూడా నేను, ఆమె కలిసి నటిస్తాం. ఆ విషయంలో రష్మికకు కూడా ఎలాంటి సమస్య ఉందనుకొంటా. అప్పుడు రష్మిక తండ్రి, ఆమె అనుమతి కూడా ఉంటుంది అని నేషనల్ క్రష్ ముందే సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలు చేశారు.

Take a Poll

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X