సల్మాన్ ఖాన్‍ను ఆరోజే చంపేస్తా.. మరో బెదిరింపు కాల్.. డైడ్ లైన్ ఇచ్చి మరి!
బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ అంటే పెద్దగా పరిచయం అవసరం లేదు. సినిమాల్లో తనదైన నటనతో చాలా కాలంగా హిందీ ఆడియెన్స్ ను తెగ అలరిస్తున్నారు. అప్పుడప్పుడు తెలుగులో డబ్ చేసి తెలుగు వారి ఆదరణ సైతం చూరగొన్నాడు. అయితే సల్లూ భాయ్ పై పలు వివాదాలు కూడా ఉన్న విషయం తెలిసిందే. అప్పట్లో జింక కేసులో వివాదంగా మారిన సల్మాన్ కు ఇటీవల ఎక్కువగా చావు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా ఆరోజునే చంపుతామంటూ డేట్ చెప్పి మరి బెదిరించారు.
షూటింగ్స్ తో బిజీ: బాలీవుడ్ బ్యాడ్ బ్యాయ్ సల్మాన్ ఖాన్ సినిమాల పరంగా దూసుకుపోతున్నాడు. ఇటీవలే పఠాన్ సినిమాలో టైగర్ గా అదిరిపోయే కెమియే చేసిన సల్మాన్ ఖాన్ త్వరలో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. టైగర్ 3 షూటింగ్ లో బిజీగా ఉన్న సల్లూ భాయ్ 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమాతో ఎంటర్టైన్ చేయనున్నాడు. ఏప్రిల్ 21న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ను ఏప్రిల్ 10న రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

రాజస్థాన్ కు చెందిన: ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ కు తాజాగా హత్య బెదిరింపులు వచ్చాయి. రాజస్థాన్ లోనే జోధ్ పూర్ నుంచి ఆ కాల్ వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ విషయంపై ముంబై పోలీసులు స్పందిస్తూ "పోలీస్ కంట్రోల్ రూమ్ కి నిన్న (ఏప్రిల్ 10) ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తనను తాను రాకీ భాయ్ గా పరిచయం చేసుకున్నాడు. తాను రాజస్థాన్ లోని జోధ్ పూర్ కి చెందినవాడినని కూడా అతను తెలిపాడు" అని వెల్లడించారు.
గో రక్షక్ విభాగం: "రాకీ భాయ్ తన గురించి పరిచయం చేసుకున్నాక ఈ నెల 30వ తేదీన సల్మాన్ ఖాన్ ను చంపుతానని బెదిరించాడు. వెంటనే మేము కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. సల్మాన్ నివాసం వద్ద కూడా భద్రతను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ఆ బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నాం. మా ప్రాథమిక విచారణంలో భాగంగా అతడు గో రక్షక్ విభాగానికి చెందినవాడిగా తేలింది" అని ముంబై పోలీసులు పేర్కొన్నారు.

ఇప్పటికే 3 సార్లు: అంతేకాకుండా సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ విషయంపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నట్లు, దానిపై విచారణ చేపట్టినట్లుగా ముంబై పోలీసులు వెల్లడించారు. అయితే సల్మాన్ ఖాన్ కు ఇలా బెదిరింపులు రావడం ఇదేం తొలిసారి కాదు. గత నెలలో సల్మాన్ కు రెండుసార్లు బెదిరింపు ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ వచ్చాయి. అంతకుముందు 2018లోనే కృష్ణ జింకలను వేటాడిన కేసు విచారణ సమయంలోనే సల్మాన్ ను హత్య చేస్తానంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కోర్టు ఆవరణలోనే వార్నింగ్ ఇచ్చాడు.

డెడ్ లైన్ ఫిక్స్: పంజాబీ సిద్ధూ మూసేవాలాను హత్య చేసిన తర్వాత అతన్ని చంపినట్లుగానే సల్మాన్ ఖాన్ ను చంపుతామంటూ బిష్ణోయ్ సన్నిహితుడు బెదిరించిన విషయం తెలిసిందే. ఈ పరిణామల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ హై సెక్యూరిటీ బుల్లెట్ ఫ్రూఫ్ కారును రీసెంట్ గా కొనుగోలు చేశాడు. అయితే ఈసారి ఏప్రిల్ 30న చంపుతామంటూ డెడ్ లైన్ ఫిక్స్ చేయడంతో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు సల్లూ భాయ్ అభిమానులు సైతం ఆందోళనలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











