సెల్ఫీ కోసం ఫ్యాన్.. ఫోన్ లాక్కున్న సూపర్ స్టార్
ఒకప్పుడు ఆటో గ్రాఫ్స్ ఫేమస్.. మధ్యలో ఫోటోగ్రాఫ్స్ వచ్చాయి.. ఇక్కడి వరకు సెలెబ్రిటీలకు ఎలాంటి సమస్యా రాలేదు. ఎప్పుడైతే సెల్ఫీల కాలం వచ్చిందే.. అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. సెలెబ్రిటీలు కనిపిస్తే చాలు.. చేతిలో ఫోన్ పట్టుకుని మీదకు వచ్చేస్తుంటారు. అందులో వారి తప్పు ఉందనీ చెప్పలేము. అయితే అవతలి వారి పరిస్థితి ఏంటో కూడా అర్థం చేసుకుని మెసులుకుంటే ఎవ్వరికీ ఎలాంటి సమస్య ఉండదు.
అయితే కొందరు హీరోలు.. ఏ మాత్రం చిరాకు పడకుండా ఫ్యాన్స్‌కు సెల్ఫీలు ఇస్తుంటారు.. మరికొందరు సెల్ఫీలు అంటే చిరాకు పడుతుంటారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ రెండో రకానికి చెందినవాడు. సెల్ఫీల కోసం వచ్చే అభిమానులతో దురుసుగా ప్రవర్తిస్తూ వార్తల్లోకి ఎక్కుతుంటాడు. తాజాగా మరో సారి సల్మాన్ వీడియో వైరల్ అవుతోంది.

గోవా ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికి నడిచి వస్తున్న హీరో సల్మాన్‌తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు ఒక వ్యక్తి. దీనిపై కోపం తెచ్చుకున్న సల్మాన్ ఈ వ్యక్తి నుండి మొబైల్ చటుక్కున లాక్కున్నా డు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సల్మాన్ ప్రస్తుతం రాధే చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈధ్‌కు రాధే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.


Click it and Unblock the Notifications











