మరో హెచ్చరికతో.. సల్మాన్ ఖాన్ కు మరింత భద్రత పెంచిన ముంబై పోలీసులు!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల కాలంలో తరచుగా సెక్యురిటికి సంబంధించిన అంశాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రముఖ ముంబై గ్యాంగ్ స్టర్స్ నుంచి అతనికి ప్రమాదం పొంచి ఉన్నట్లు ఇదివరకే హెచ్చరికలు లేఖలు వచ్చాయి. అలాగే సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యులకు కూడా ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్స్ రావడంతో సల్మాన్ ఖాన్ ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు.
ఇదివరకే సల్మాన్ ఖాన్ ఖాన్ గ్యాంగ్ స్టర్స్ నుంచి వచ్చిన బెదిరింపుల విషయంలో కోర్టును ఆశ్రయించారు. ఇక బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసినట్లు కూడా విచారణలో రుజువు కావడంతో సల్మాన్ ఖాన్ కు వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం సెక్యురిటిని కల్పించింది. అతనికి ప్రాణహాని ఉందని మొదట్లో X క్యాటగిరి సెక్యురిటిని ఏర్పాటు చేశారు ఇప్పుడు దాన్ని Y+ కి పెంచారు.

ప్రముఖ పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలాను హతమార్చిన గ్యాంగ్ మరికొందరు బాలీవుడ్ సెలబ్రెటీలను టార్గెట్ చేసినట్లు కూడా ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఇక సల్మాన్ ఖాన్ కూడా లైసెన్స్ తో కూడిన రివాల్వర్ కూడా కొనుగోలు చేశారు. ఇక ఇప్పుడు అతనికి మహారాష్ట్ర గవర్నమెంట్ సెక్యూరిటీని X నుండి Y+కి పెంచారు. ఇద్దరు సాయుధ గార్డులు నిత్యం సల్మాన్ ఖాన్ కు సెక్యురిటి ఇవ్వాల్సి ఉంటుంది.
అంతేకాకుండా, అతని నివాసంలో కూడా ఇద్దరు గార్డులు ఉంటారు. సల్మాన్ ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు పెరగడంతో ముంబై పోలీస్ ప్రొటెక్షన్ బ్రాంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక సల్మాన్ ఖాన్ షూటింగ్స్ తో పాటు ఎక్కడికి వెళ్లినా కూడా కూడా తన సెక్యురిటీకి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముందుగా పోలీసులకు సమాచారాన్ని అందించి గాని అతను బాహ్య ప్రపంచంలోకి వెళ్లడం లేదు. ఇక సల్మాన్ ఖాన్ తో పాటు అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్ లకు కూడా ఎక్స్ క్యాటగిరి భద్రతను కల్పించాలని మహారాష్ట్ర రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది.


Click it and Unblock the Notifications











