twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అభినవ గానకోకిలపై సల్మాన్ ఖాన్ ఫిదా.. 55 లక్షల అపురూప బహుమతి!

    |

    Recommended Video

    Salman Khan Gifts Viral Singing Sensation Ranu Mondal A House || Filmibeat Telugu

    దేశం గర్వించే గాన కోకిల లతా మంగేష్కర్ పాడిన పాట 'ఏక్ ప్యార్‌ కా నగ్మా' పాటతో బిచ్చగత్తె రాను మొండల్ ఓవర్‌నైట్ లోనే స్టార్‌ సింగర్‌గా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె పాటలు ట్రెండింగ్ మారడమే కాకుండా విశేషమైన పాపులారిటీని దక్కించుకొన్నది. కేవలం సాధారణ ప్రజలే కాకుండా స్టార్ హీరోలు కూడా ఫిదా అవుతున్నారు. తాజాగా ఆమెకు ఫేవరేట్లుగా మారిన జాబితాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చేరిపోయారు. అంతేకాకుండా భారీగా ఆర్థిక సహాయం చేయడం మరో ట్రెండింగ్ అంశంగా మారింది. వివరాల్లోకి వెళితే..

    సోషల్ మీడియాలో రాను మొండల్

    సోషల్ మీడియాలో రాను మొండల్

    ట్రైన్‌లో రాను మొండల్ పాడుతున్న పాటను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఆ తర్వాత ప్రముఖ సింగర్, గాయకుడు, సంగీత దర్శకుడు హిమేష్ రేషమ్మియా దృష్టిలో పడింది. వెంటనే ఆమెకు ఓ పాటను పాడే అవకాశం కల్పించాడు. దాంతో రాను మొండల్ ఉన్నట్టుండి సెలబ్రిటీ హోదాను సంపాదించుకొన్నారు.

    హిమేష్ రేషిమ్మియా ప్రోత్సాహం

    హిమేష్ రేషిమ్మియా ప్రోత్సాహం

    రాను మొండల్ ప్రతిభను గుర్తించిన హిమేష్ రేషమ్మియా తన తాజా చిత్రం హ్యాపీ, హార్డీ, హీర్ అనే చిత్రం కోసం తెరి మేరీ కహాని అనే పాటను పాడించారు. రానుతో పాటను రికార్డింగ్ చేయిస్తున్న వీడియోను హిమేష్ సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో వైరల్‌ అయింది. దాదాపు 2 లక్షలకు పైగా మంది వీక్షించడం విశేషం.

    కలలు సాకారం కావాలంటే..

    కలలు సాకారం కావాలంటే..

    సింగర్ రాను మొండల్ ప్రతిభ గురించి హిమేష్ స్పందిస్తూ.. ప్రతిభావంతుల కలలు సాకారం కావాలంటే.. మనలాంటి వాళ్లు వారిన టాలెంట్‌ను ప్రోత్సాహించాలి. సానుకూల దృక్పథం కలలను సాకారం చేస్తుంది. ఈ కల సాకారంలో వెన్నంటి ఉన్న వారికి నా థ్యాంక్స్ అని హిమేష్ అన్నారు.

     ఇంటిని గిఫ్టుగా ఇచ్చిన సల్మాన్ ఖాన్

    ఇంటిని గిఫ్టుగా ఇచ్చిన సల్మాన్ ఖాన్

    తాజాగా రాను మొండల్‌పై సల్మాన్ ఖాన్ ఫిదా అయ్యారు. రాను ప్రతిభను గుర్తించి ఆమెకు రూ.55 లక్షల విలువైన ఇంటిని బహుమతిగా సల్మాన్ ఖాన్ అందించారు. ఇక ముందు ఈ ఇంటర్నెట్ సెన్సేషన్ ఎన్ని అవార్డులు, రివార్డులు అందుకొంటారో వేచి చూడాల్సిందే.

    ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మార్చిన వీడియో

    రైలులో లతా మంగేష్కర్ పాట పాడి ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన వీడియో ఇదే

    సినిమా కోసం పాట పాడిన రాను మొండల్

    ఇంటర్నెట్ సెన్సేషన్ రాను మొండల్‌ను ప్రోత్సహిస్తూ పాటను పాడించిన హిమేష్ (వీడియో)

    English summary
    Ranu Mondal, who recently went viral when a video of her singing the famous Lata Mangeshkar song, 'Ek pyaar ka naagma' started trending online, has received a home as a gift from Salman Khan. Reports suggest that Salman Khan gifts house worth Rs 55 lakh to Internet sensation Ranu Mondal
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X