పెళ్లి చేసుకోవాలా? సంతోషంగా ఉండాలా?.. మళ్లీ ఆ విషయం అడగలేదు.. సల్మాన్ గర్ల్‌ఫ్రెండ్ కామెంట్స్
సల్మాన్ ఖాన్ పెళ్లి విషయం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. ప్రేమలు, బ్రేకప్‌లు సల్మాన్ విషయంలో సర్వసాధారణం. ప్రేమ మాత్రం అలా వస్తూ పోతోంది కానీ పెళ్లి ఘడియలే ఇంకా రావడం లేదు. కత్రినా కైఫ్‌తో వ్యవహారం దాదాపు పెళ్లి పీఠల వరకు వచ్చినట్టే వచ్చింది. మళ్లీ దూరమైంది. ఆ తరువాత మళ్లీ కత్రినా దగ్గరైంది కానీ ఆ ఊసే ఎత్తడం లేదని తెలుస్తోంది. సల్లూ భాయ్ ప్రస్తుతం విదేశీ భామలతో ఎంజాయ్ చేస్తున్నాడు. శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రోమన్ సుందరి లులియా వాంటూర్‌తో ఫామ్ హౌస్‌లో ఉన్నాడు. లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు.

ఫామ్‌హౌస్‌లో సందడి..
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలో సల్మాన్ తన గర్ల్ ఫ్రెండ్స్‌తో పన్వేల్ ఫామ్ హౌస్‌లో ఇరుక్కుపోయాడు. ఈ విషయాన్నే వారే స్వయంగా చెప్పుకొచ్చారు. అక్కడే వారంతా సరదాగా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

లైవ్‌లో మెరిసిన సల్మాన్..
సోషల్ మీడియాలో లూలియా ఇస్తున్న లైవ్ లో సల్మాన్ ఖాన్ వెనుక నుండి తళుక్కున మెరిశాడు. ఈ బ్యూటీ అక్కడ ఎవరెవరు.. ఎలా స్పెండ్ చేస్తున్నారు అనే విశేషాలను ఫ్యాన్స్ తో పంచుకుంది. వీరి పెళ్లి వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ అయింది. పెళ్లి గురించి లూలియా మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

అందరూ అదే ప్రశ్న..
పెళ్లెప్పుడు అనే ప్రశ్నకు లూలియా స్పందిస్తూ.. ‘ఓ గాడ్.. ప్రతీ సారి ఈ ప్రశ్న వింటూనే ఉన్నాను. పెళ్లి కంటే ముఖ్యం ఆ ఇద్దరు వ్యక్తులు ఎలాఉంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారనేది ముఖ్యం. ఇద్దరూ సమయాన్ని వెచ్చించి గడపడమే అన్నింటి కంటే ముఖ్యమైంది. ఒకానొక సమయంలో మా తల్లిదండ్రులు కూడా పెళ్లెప్పుడు అనే ప్రశ్నను నా ముందు ఉంచారు.
Recommended Video

పెళ్లి చేసుకోవాలా? సంతోషంగా ఉండాలా?
మామ్.. నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారా? లేదా కేవలం పెళ్లి చేసుకుంటే చాలా? పెళ్లి చేసుకోమంటే ఎవరో ఒకర్ని రేపే చేసుకుంటానని చెప్పాను. అంతే అదే చివరిసారి ఇంకెప్పుడు ఆ ప్రశ్నను నన్ను వారు అడగలేదు. ఒకరితో హ్యాపిగా ఉండటం, సమయాన్ని గడపడమే నా దృష్టిలో పెళ్లి కంటే ముఖ్యమైంద'ని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











