సల్మాన్ ఆర్థిక సహాయం ఎంతో తెలిస్తే షాకే.. 25 వేల మందికి.. రోజు ఎంతంటే
విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు, బాధితులకు అండగా నిలువడంలో సల్మాన్ ఖాన్ ఎప్పుడూ ముందుంటారనే పేరుంది. ఆయన స్వచ్చంద సంస్థ బీయింగ్ హ్యూమన్ పేరుతో విరాళాలు, ఆర్థిక సహాయం, వైద్య పరీక్షలు జరిపిస్తుంటారు. తాజాగా కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సినీ పరిశ్రమ కార్యకలాపాలు స్తంభించాయి. ఈ కారణంగా రోజువారీ వేతన కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ క్రమంలో వారిని ఆదుకొనేందుకు సల్మాన్ ఖాన్ ముందుకు వచ్చారు. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ అందించే ఆర్థిక సహాయం వివరాలు ఇవే..
Recommended Video

25 వేల మందికి ఆర్థికంగా
బాలీవుడ్‌లో మొత్తంగా 5 లక్షల మంది రోజువారీ వేతన కార్మికులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వారిలో ఇప్పటికిప్పుడు ఆర్థికంగా, ఆహారం పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి గురించి ఆరా తీసి మొత్తం 25 వేల మందిని గుర్తించినట్టు సల్మాన్ బీయింగ్ హ్యూమన్ నిర్వాహకులు తెలిపారు.

నేరుగా బాధితుల ఖాతాలోకే
ప్రస్తుతం 25 వేల మందికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని సల్మాన్ ఖాన్ నిర్ణయించారు. ఏదైనా సంస్థకు గానీ, ప్రభుత్వాలకు గానీ ఆర్థిక సహాయం అందించకుండా.. నేరుగా బాధితులకు అకౌంట్‌లోకే డబ్బులు వేయాలని నిర్ణయించారు. ఈ సహాయంలో రాజకీయ, ఇతర నేతల జోక్యం లేకుండా స్వచ్ఛందంగా సహాయం అందేందుకు చేసిన ప్రయత్నాలపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతీ రోజు ఒక్కో కుటుంనికి 250 రూపాయలు
తాజా సమాచారం ప్రకారం.. 25 వేల మందికి రోజుకు 250 రూపాయల చొప్పున వారి అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తున్నారని, అలా 21 రోజుల పాటు ప్రతీ కుటుంబానికి మొత్తం 5250 రూపాయలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు మొత్తంగా 25 వేల మందికి 21 రోజుల్లో సల్మాన్ ఖాన్ అందించే సహాయం రూ. 13,12, 50,000 అని బీయింగ్ హ్యూమన్ నిర్వాహకులు చెప్పినట్టు సమాచారం.

సల్మాన్ ఇంట్లో విషాదం
కాగా సల్మాన్ ఖాన్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకొన్నది. తనకు ఇష్టమైన, 38 ఏళ్ల మేనల్లుడు హృదయ సంబంధ వ్యాధితో ముంబైలో మార్చి 31వ తేదీ రాత్రి కన్నుమూశారు. దీంతో సల్మాన్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు.


Click it and Unblock the Notifications











