Don't Miss!
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
నా పెళ్లి గురించి 23న ప్రకటన.. పిల్లల్ని అలా కంటాను.. సల్మాన్ ఖాన్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మీడియా అడిగే ప్రశ్నలకు చాలా తెలివిగా జవాబులిస్తుంటాడు. సాధారణంగా సల్మాన్ను ఎక్కువసార్లు అడిగే ప్రశ్న పెళ్లి గురించే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా భారత్ సినిమా ప్రమోషన్లో భాగంగా రెగ్యులర్గా మీడియా అడిగే పెళ్లి ప్రశ్నకు షాకింగ్ జవాబిచ్చాడు. నా పెళ్లి గురించి మే 23న సంచలన ప్రకటన చేస్తానని సల్మాన్ తెలిపాడు. కానీ వెంటనే తన మాటకు మీడియా ప్రతినిధుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి తానే పడి పడి నవ్వుకొన్నాడు. ఇంతకు ఏం జరిగిందంటే
దేశవ్యాప్తంగా మే 23న లోక్సభ ఎన్నికల ఫలితాలు వస్తుంటాయి. వచ్చే పదేళ్లకు ఎవరు ప్రధాని అవుతారో అనే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అప్పుడు నా పెళ్లి వార్త చెబితే ప్రధాని ఎవరనే విషయాన్ని పట్టించుకొంటారా? లేకా నా పెళ్లి వార్తను పట్టించుకొంటారా అని నవ్వుతూ బదులిచ్చారు.
నాకు తండ్రి అవ్వాలనే కోరిక బలంగా ఉంది. నాకు పిల్లలు అంటే ఇష్టం. పిల్లల్ని కనాలంటే వారికి తల్లి కావాలి. కానీ నాకు వారి తల్లి వద్దు. అందుకే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఏదో ఒకటి చేసి తండ్రిని అవుతాను అని సల్మాన్ ఖాన్ చెప్పాడు.
నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకొనే ఆసక్తి లేదు. అందుకే సరోగసి (కృత్రిమ గర్భధారణ) ద్వారా భవిష్యత్లో పిల్లలకు తండ్రిని అవుతా అని సల్మాన్ అన్నారు. ఇప్పటికే బాలీవుడ్ సూపర్స్టార్లు అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ ఇద్దరూ సరోగసి ద్వారా సంతానం పొందిన విషయం తెలిసిందే.
కెరీర్ విషయానికి వస్తే, సల్మాన్ ఖాన్ నటించిన భారత్ చిత్రం ఈద్ కానుకగా జూన్ 5న రిలీజ్ కానున్నది. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. యాన్ ఆడ్ టూ మై ఫాదర్ అనే కొరియా చిత్రం స్ఫూర్తిగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ నటించింది.