twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    GARI దేశంలోకి తొలి క్రిప్టో టోకెన్ కరెన్సీ.. సల్మాన్ చేతుల మీదుగా ఆవిష్కరణ

    |

    దేశవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ క్రేజ్ ఊహించని రీతిలో ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బిట్ కాయిన్ ధర రాకెట్‌లా నింగిలోకి దూసుకెళ్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో దేశీయ వినోద పరిశ్రమ ముఖ్యంగా బాలీవుడ్ మార్పిడికి అవకాశం ఉన్న నాన్ ఫంగిబుల్ టోకెన్స్ (ఎన్ఎఫ్టీ) ఆవిష్కరించింది. క్రిప్టో కరెన్సీ ఫ్లాట్‌ఫామ్‌పై ప్రమోట్ చేసే విధంగా ఎన్‌ఫ్‌టీ కాయిన్‌ గారీ (GARI)ను బాలీవుడ్ సూపర్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ..

    చింగారీ యాప్‌లో అధికారికంగా

    చింగారీ యాప్‌లో అధికారికంగా

    భారతదేశంలో తొలి క్రిప్టో టొకెన్‌ షార్ట్ వీడియో యాప్ చింగారీలో ఆవిష్కరించాం. ఎన్ఎఫ్‌టీ మార్కెట్ ప్లేస్‌ను, గారీ టొకెన్ రివార్డు ప్రోగ్రాంను చింగారీ యాప్‌లో అధికారికంగా ఆవిష్కరించాం. మీరు నా వీడియో ఎన్‌ఎఫ్‌టీలను నేరుగా కొనుగోలు చేయవచ్చు. కంటెంట్ క్రియేషన్, దానికి విలువ కట్టే (మానిటైజేషన్) విషయంలో కొత్త చాప్టర్ మొదలైంది. అందుకు నేను చీర్స్ చెబుతున్నాను అంటూ సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు.

    భవిష్యత్ యాప్ కరెన్సీగా

    క్రిప్టో టొకెన్ గారీ ద్వారా చింగారీ వీడియో యాప్ చింగారీ క్రిప్టో కరెన్సీ రంగంలోకి ప్రవేశించింది. ఫంగిబుల్ బ్లాక్‌చైన్ టోకెన్‌గా వ్యవహరిస్తున్న ఈ కరెన్సీని గారీ అని వ్యవహరిస్తున్నారు. ఈ కరెన్సీ భవిష్యత్ యాప్ కరెన్సీగా, అలాగే గవర్నెనెన్స్ టొకెన్‌గా సేవలు అందిస్తుంది అని కంపెనీ వెల్లడించింది. ఈ టోకెన్ కోసం సొలానా బ్లాక్‌చైన్‌తో చింగారీ కంపెనీ భాగస్యామ్యమైంది.

    కంటెంట్ క్రియేట్ చేసే వారికి

    కంటెంట్ క్రియేటర్ల కోసం గారీ టోకెన్లను చింగారీ యాప్ ఎందుకు ప్రవేశపెట్టిందంటే.. కొన్ని కంపెనీలు, బ్రాండ్స్, వ్యక్తిగతంగా సోషల్ టోకెన్స్‌ను డిజిటల్ అసెట్స్‌గా ప్రమోట్ చేస్తున్నారు. కంటెంట్ క్రియేట్ చేసే వారికి ఆడియెన్స్‌తో బలమైన బంధం ఉండటానికి క్రియేటర్లకు ప్రోత్సాహం అందించడానికి అడుగులు వేస్తున్నారు. చింగారీ క్రియేటర్లకు గారీ కాయిన్ సోషల్ టోకెన్‌గా ఉాపయోగపడుతుంది. భవిష్యత్‌లో గారీ టొకెన్స్ క్రిప్టో కరెన్సీకి సమాంతరంగా ఎదుగుతుంది. నిత్య జీవితంలో భాగమవుతుందనే ఆశాభావాన్ని కంపెనీ ప్రతినిథులు వ్యక్తం చేశారు.

    యాక్టర్లు, కంటెంట్ క్రియేటర్లు కనెక్ట్ అయ్యేలా

    చింగారీ యాప్ యూజర్లు గారీ టొకెన్స్ ఉయోగించవచ్చు. యాప్‌కు కనెక్ట్ కావడం ద్వారా వాటిని ద్వారా ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించవచ్చు. ముఖ్యంగా యాక్టర్లు, కంటెంట్ క్రియేటర్లు, వీక్షకులు, అడ్వర్టైజర్లు, డెవలపర్స్ మధ్య ఆర్థిక వ్యవహారాలు ఎక్కువగా జరిగేలా ఉపయోగపడుతుంది అని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వీక్షకులు కంటెంట్ క్రియేటర్ల సేవలను, వీడియోలను, వస్తువులను, క్రియేటర్ ప్రొఫైల్స్‌ను నేరుగా గారీ టోకెన్స్ ద్వారా ఆర్థిక కార్యకలాపాలను నిర్వర్తించుకోవచ్చు అని చెప్పారు.

    Recommended Video

    Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu

    మార్కెట్‌లోకి 1 బిలియన్ గారీ కరెన్సీ

    తొలి ఏడాదిలో ఒక బిలియన్ మేర గ్యారీ టొకెన్స్‌ మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. వాటిలో 200 నుంచి 300 మిలియన్ల వరకు సర్కులేషన్‌లో ఉంచుతాం. డిజిటల్ అసెట్స్, బ్లాక్‌చైన్ రంగాన్ని అభివృద్ది చేయడమే లక్ష్యంగా పనిచేస్తాం అని చింగారీ సీఈవో, చైర్మన్ సుమిత్ ఘోష్ తెలిపారు.

    English summary
    Salman Khan introduced Indian's First Cropto Token GARI. Salman Khan tweeted that, I am officially launching Chingari’s in app GARI Tokens reward programme & its NFT Marketplace. You can buy my Video NFTs, exclusively on the GARI NFT Marketplace. Cheers to a new chapter in Content Creation & Monetisation!!! #ChingariKiGari #GariTokens."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X