twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విలన్ ఎంత పెద్దగా ఉంటే.. పోరాడటంలో అంత మజా ఉంటుంది.. సల్మాన్ ట్వీట్ వైరల్

    |

    బాలీవుడ్ లోనే కాదు.. ఏ ఇండస్ట్రీలోనైనా సరే సల్మాన్ ఖాన్ అనే పేరు తెలియని వారుండరు. వరుస హిట్లు, వరుస రికార్డులతో సల్మాన్ తిరుగులేని హీరోగా దూసుకుపోతున్నాడు. కేవలం సల్లూ భాయ్ తెరపై కనిపిస్తే చాలు.. కనక వర్షం కురుస్తుందని బీ టౌన్లో టాక్ నడుస్తోంది.

    దూసుకుపోతున్న సల్మాన్..

    దూసుకుపోతున్న సల్మాన్..

    ఇక సల్మాన్ సినిమా అంటే తక్కువలో తక్కువ కనీసం వందకోట్లు కలెక్ట్ చేస్తుందని తెలిసిందే. అయితే సినిమాలోని కథాకథానలతో సంబంధం లేకుండా అతని సినిమాలు హిట్లుగా నిలుస్తాయి. వంద కోట్లు కలెక్ట్ చేసిన సినిమాను హిట్ అని అంటాం.. కానీ సల్మాన్ ఖాన్ చిత్రానికి మాత్రం అలా చెప్పలేం. వరుసగా తొమ్మిది చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వందకోట్లను కలెక్ట్ చేశాయి.

    వరుసగా వందకోట్ల సినిమాలు..

    వరుసగా వందకోట్ల సినిమాలు..

    స్వతంత్ర్యం రాక పూర్వం నుంచి ప్రస్తుతం వరకు జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన కల్పిత చిత్రం ‘భారత్'లో సల్మాన్ విభిన్న పాత్రలను పోషించాడు. అయితే సల్మాన్ లుక్స్, ట్రైలర్, సాంగ్స్ ఇలా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. తీరా మూవీ రిలీజై.. అంచనాలను అందుకోలేకపోయింది. అయినా.. రికార్డు కలెక్షన్లను సాధించింది. అయితే సల్మాన్ స్క్రీన్ పై కనిపిస్తే.. చాలు కలెక్షన్లు డోకా లేదని మరోసారి నిరూపించాడు.

    ప్రభుదేవా దర్శకత్వంలో దబాంగ్3

    ప్రభుదేవా దర్శకత్వంలో దబాంగ్3

    ప్రస్తుతం సల్మాన్ ప్రభుదేవా దర్శకత్వంలో దబాంగ్3 చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీని ప్రభుదేవా అద్భుతంగా తెరకెక్కించినట్లు సమాచారం. అయితే తాజాగా రిలీజ్ చేసిన దబాంగ్3 టీజర్ ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. చుల్ బుల్ పాండేగా సల్మాన్.. మరోసారి అభిమానులను మెస్మరైజ్ చేసేందుకు వస్తున్నాడు. సినిమా నాది.. పోస్టర్ నాది.. ప్రమోషన్ కూడా నేనే చేయాలి కదా అంటూ ఓ టీజర్ ను కూడా రిలీజ్ చేశాడు. అది కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

    బల్లి అనే రోల్ లో..

    తాజాగా ఈ చిత్రంలో విలన్ రోల్ చేస్తోన్న కిచ్చా సుదీప్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. దీనితోపాటు సల్మాన్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. విలన్ ఎంత పెద్దగా ఉంటే.. పోరాడటంలో అంత మజా ఉంటుందని తెలిపాడు. దీన్ని బట్టి చూస్తే.. సుదీప్ ఎంత భయంకరంగా ఉంటాడో అర్థమవుతోంది. ఈ మూవీలో బల్లి అనే పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరి మధ్య పోరాటం ఎలా ఉంటుందో చూడాలంటే డిసెంబర్ 20 వరకు ఆగాల్సిందే. ఈ సినిమాను సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ పై తన సోదరుడు అర్బాజ్ ఖాన్ నిర్మిస్తున్నాడు.ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తోంది.

    English summary
    Villain jitna bada ho, usse bhidne mein utna hi mazaa aata hai. Introducing Sudeep Kiccha as Balli in 'Dabangg 3'.This Movie Directed By Prabhudeva. releasing On 20th December.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X