For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సల్మాన్ ఖాన్ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు: జరీన్ ఖాన్

  |

  బాలీవుడ్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరు? అంటే అందరూ ముందుగా చెప్పే పేరు సల్మాన్ ఖాన్. మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్న సల్లూ భాయ్ మీద చాలా మంది మహిళలు మనసు పారేసుకున్నారు. 50 సంవత్సరాలు వచ్చినా పెళ్లికి దూరంగా ఉంటున్న ఇతగాడంటే పలువురు హీరోయిన్లకు కూడా క్రష్ ఉంది. అలాంటి వారిలో ఒకరు బాలీవుడ్ నటి జరీన్ ఖాన్. పెళ్లి చేసుకునే అవకాశం వస్తే సల్మాన్‌ను చేసుకుంటానని చెబుతోంది.

  తాజాగా ఓ ఆంగ్లపత్రిక ఇంటర్వ్యూలో పాల్గొన్న జరీన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'కిల్, మ్యారీ, హుక్ అప్' లాంటి మూడు అంశాల్లో దేనికి ఎవరిని ఎంచుకుంటారు? అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.... గౌతమ్ రోడో, కరణ్ సింగ్ గ్రోవర్, సల్మాన్ ఖాన్ అంటూ సమాధానం ఇచ్చారు.

  Salman Khan is getting married to me: Zareen Khan like this rumor

  మీపై ఎలాంటి రూమర్ వస్తే ఫన్నీగా ఫీలవుతారు అనే ప్రశ్నకు రియాక్ట్ అవుతూ... 'సల్మాన్ ఖాన్ నన్ను పెళ్లి చేసుకుంటున్నారు' అనే రూమర్స్ స్ప్రెడ్ అయితే చాలా ఫన్నీగా ఫీలవుతాను అని వ్యాఖ్యానించారు.

  'వాస్తవానికి నేను ఎవరినీ చంపాలనుకోను. అదే విధంగా పెళ్లిపై నాకు నమ్మకం లేదు, పెళ్లి అనేది సాంప్రదాయ బద్దమైనది... కానీ ఈ రోజుల్లో వివాహం అనేది ఒక జోక్‌గా మారిపోయింది.' అని జరీనా ఖాన్ చెప్పుకొచ్చారు.

  సల్మాన్ ఖాన్ అంటే జరీన్ ఖాన్ మనసులో ప్రత్యేక స్థానం ఉండటం సహజం. ఎందుకంటే ఆమె సల్మాన్ ఖాన్ 'వీర్' సినిమా ద్వారానే బాలీవుడ్ తెరంగ్రేటం చేశారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటంతో ఆమె కరీర్ మీద తీవ్రమైన ప్రభావం పడింది.

  English summary
  Zareen playfully said, "A fun rumour I would like to spread is that Salman Khan is getting married to me."
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X