twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెండు సినిమాలకే కనిపించకుండా పోయారు.. నా సక్సెస్‌కు మా అన్న కారణం కాదు!

    |

    సల్మాన్ ఖాన్ సోదరుడిగా అర్భాజ్ ఖాన్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా బాలీవుడ్ లో అర్భాజ్ ఖాన్ కు ఓ గుర్తింపు ఉంది. సల్మాన్ ఖాన్ నటించిన పలు చిత్రాల్లో అర్భాజ్ ఖాన్ కీలక పాత్రల్లో నటించాడు. అర్భాజ్ ఖాన్ ప్రస్తుతం దబాంగ్ 3 చిత్రంలో నటిస్తూ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అర్భాజ్ ఖాన్ మాట్లాడుతూ తన బాలీవుడ్ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

     తిరుగులేని స్టార్

    తిరుగులేని స్టార్

    బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తిరుగులేని స్టార్ హీరో. సల్మాన్ ఖాన్ తన చిత్రాల ద్వారా, ప్రతిభ ద్వారా ఈ స్థాయికి చేరుకున్నాడు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఓ శక్తి. సల్మాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల బిజినెస్ చేస్తాయి. కానీ సల్మాన్ ఖాన్ స్టార్‌డం, పరపతి లాంటి అంశాలేవీ తాను ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి కారణం కాదని అర్భాజ్ ఖాన్ అంటున్నాడు. బాలీవుడ్ లో తనకు వస్తున్న అవకాశాలకు తానే కారణం అని అర్భాజ్ ఖాన్ చెబుతున్నాడు.

    సల్మాన్ ఖాన్ తమ్ముడిని కాబట్టి

    సల్మాన్ ఖాన్ తమ్ముడిని కాబట్టి

    నేను సల్మాన్ ఖాన్ తమ్ముడిని కాబట్టి ప్రేక్షకులు రెండు మూడు చిత్రాల్లో నన్ను భరిస్తారు. ఆ తర్వాత నిరూపించుకోవాల్సింది నేనే. ప్రస్తుతం నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నానంటే అందుకు కారణం నా సోదరుడు సల్మాన్ కాదు. ప్రస్తుతం నాకు అవకాశాలొస్తున్నాయంటే అందుకు కారణం నా ప్రతిభే. నా నటన కొందరికి నచ్చొచ్చు, నచ్చక పోవచ్చు.. కానీ దానివల్లే నేను ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని అర్భాజ్ ఖాన్ తెలిపారు.

    రెండు సినిమాలకే

    రెండు సినిమాలకే

    బాలీవుడ్ లో రెండు సినిమాలకే కనిపించకుండా పోయిన నటీనటులు చాలా మందే ఉన్నారు. కానీ తాను రెండు దశాబ్దాల నుంచి బాలీవుడ్ లో కొనసాగుతూ దాదాపు 70 చిత్రాల్లో నటించానని అర్భాజ్ ఖాన్ తెలిపారు. తాను సల్మాన్ ఖాన్ తమ్ముడిని కాబట్టి అన్ని అవకాశాలు రాలేదని అర్భాజ్ తెలిపాడు. అర్భాజ్ ఖాన్ 1996లో దరార్ అనే చిత్రంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. సల్మాన్ ఖాన్ అప్పటికే స్టార్ గా బాలీవుడ్ లో రాణిస్తున్నాడు.

    కెరీర్ ఆరంభంలో

    కెరీర్ ఆరంభంలో

    అర్భాజ్ ఖాన్ కెరీర్ ఆరంభంలో హలో బ్రదర్, ప్యార్ కియా తో ధర్నా క్యా లాంటి సల్మాన్ సూపర్ హిట్ చిత్రాలలో నటించాడు. ఆ చిత్రాలు అర్భాజ్ ఖాన్ కెరీర్ కు బాగా ఉపయోగపడ్డాయి. ఇక 2010లో వచ్చిన దబాంగ్ చిత్రం అటు నిర్మాతగా, నటుడిగా అర్భాజ్ ఖాన్ కెరీర్ కు మరింత జోష్ ని ఇచ్చింది. ప్రస్తుతం అర్భాజ్ ఖాన్ పించ్ అనే షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

    English summary
    Salman Khan is not the reason why Arbaaz Khan has survived in this industry. Arbaaz Khan says that his brother Salman Khan's popularity and power is not the reason behind his survival in the Bollywood industry, but his own hard work and merit
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X