నాకు ఆ శక్తి లేదు..పెళ్లి గురించి అడిగితే ఇదెక్కడి సమాధానం సల్మాన్!
Recommended Video

కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి ఎదురుచూసిన అభిమానులకు, పెళ్లి ఎప్పుడంటే సమాధానాలు చెప్పి విసిగిపోయిన సల్మాన్ ఖాన్ కు నీరసం వచ్చేసింది. అందుకే పెళ్లి ప్రస్తావన తీసుకుని వచ్చినప్పుడల్లా సల్మాన్ వెటకారంగా సమాధానం ఇస్తున్నాడు. ముంబైలోని ఓ ఈవెంట్ లో మెరిసిన సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి వెటకారంగా సమాధానం ఇచ్చి ఆశ్చర్య పరిచాడు.

సల్మాన్ పెళ్లి కోసం అభిమానుల ఎదురుచూపులు
ఈ బాలీవుడ్ కండల వీరుడు వయసులో అర్థసెంచరీ కొట్టి రెండుళ్లు అవుతోంది. జీవితాంతం సింగిల్ గానే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడో ఏమో తెలియదు. పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచించకుండా జీవితం గడిపేస్తున్నాడు.

పెళ్లి ప్రస్తావన మరోసారి
సల్మాన్ ఖాన్ నేడు ముంబైలో ఓ ఈవెంట్ కు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా మీడియా నుంచి ఎప్పటిలాగే పెళ్లి ఎప్పుడునే ప్రశ్న ఎదురైంది.

వెటకరంగా సమాధానం
ఈప్రశ్నకు సల్మాన్ ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచింది. పెళ్లి అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అప్పట్లో మా తండ్రి వివాహం రూ 180 తో ముగిసిపోయిందట. కానీ ఈ రోజుల్లో పెళ్లి అంటే కోట్లతో కూడుకున్న వ్యవహారం. అమ్మాయి కోసం వెతికే ప్రక్రియ నుంచి వివాహం తరువాత భార్య కోసం చేసే ఖర్చు వరకు అంతా డబ్బుతో ముడిపడి ఉంటుంది. అలాంటి ఖర్చు నేను భరించలేను. ఆ శక్తి నాకు లేదు అంటూ సమాధానం ఇచ్చాడు.

ఆశ్చర్యపోయిన మీడియా ప్రతినిధులు
సల్మాన్ నుంచి ఊహించని సంధానం ఎదురుకావడంతో అక్కడున్న మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోయారు.

ఒక్క ఎఫైర్ కూడా సక్సెస్ కాలేదు
సల్మాన్ జీవితంలో లవ్ ఎఫైర్ లు చాలానే ఉన్నాయి. సంగీత బిజ్లానీ మొదలుకుని ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్ ఇలా సల్మాన్ ప్రేమ జాబితాలో చాలా మంది అగ్ర హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ ఒక్క ప్రేమ కథ కూడా సక్సెస్ కాలేదు.

రొమేనియా బ్యూటీతో సహజీవనం
సల్మాన్ ఖాన్ తాజగా రొమేనియా బ్యూటీ ఇలూయాతో ఘాటు ప్రేమ వ్యవహారం సాగిస్తున్నాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆమెతో సల్మాన్ సహజీనం చేస్తున్నట్లు కూడా బాలీవుడ్ వర్గాలలో ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది.

పెళ్లి ఎప్పుడో మరి
కనీసం ఇలూయాతో అయినా పెళ్లిపీటల వరకు వెళతాడా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications











