ప్రియాంక చోప్రాను తీసుకో.. నాకు కత్రినా కావాలి.. సల్మాన్ మొండిగా

బాలీవుడ్‌లో రంజాన్ అంటే ఠక్కున గుర్తొచ్చేది కండలవీరుడు సల్మాన్ ఖాన్. ఏది ఏమైనా ఈద్‌కు తన బొమ్మ స్క్రీన్‌పై పడాల్సిందే. గత కొన్నేళ్లుగా సల్మాన్ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా కత్రినా కైఫ్‌తో కలిసి భారత్ సినిమాతో ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే 2020 కోసం సంజయ్ లీలా భన్సాలీ రూపొందించే ఇన్షాల్లా అనే సినిమాను ఈద్‌కు సిద్ధం చేశారు. అయితే అనూహ్యంగా ఇన్షాల్లా ఈద్‌కు రాకుండా వాయిదాపడింది. దాంతో ఈద్ కోసం మరో సినిమాను సిద్ధం చేశాడు సల్మాన్ ఖాన్.

నీ మనసులో దూరిపోవడమే

నీ మనసులో దూరిపోవడమే

ఇన్షాల్లా సినిమా వాయిదా పడటంపై సల్మాన్ ఖాన్ ట్విట్టర్‌లో స్పందించాడు. సంజయ్ లీలా భన్సాలీ సినిమాను ముందుకు తోశాం. అయినా ఈద్ 2020కి మీ ముందుకు వస్తున్నాం అని సల్మాన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. నా గురించి ఎక్కువగా ఆలోచించకు. నీ మనసులో దూరిపోవడమే కాందు ఈద్‌ పండుగ రోజున కూడా మీతో ఉంటాను అని సల్మాన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మూడోసారి ప్రభుదేవాతో

మూడోసారి ప్రభుదేవాతో

దాంతో సల్మాన్ మరో సినిమా చేస్తున్నాడని, ఆ సినిమా పేరు రాధే. దానికి ప్రభుదేవా దర్శకుడు అనే రూమర్లు మీడియాలో తెగ ప్రచారం అవుతున్నాయి. కొరియన్ యాక్షన్ సినిమా ది అవుట్‌లా సినిమాను రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారనే కథనాలు వెలుగులోకి వచ్చాయి.

మొండిగా సల్మాన్ ఖాన్

మొండిగా సల్మాన్ ఖాన్

మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. రాధే సినిమా చేయడం లేదు గానీ. . రంజాన్‌కు మాత్రం కొత్త సినిమాతో వస్తున్నాం అని పేర్కొన్నారు. అయితే ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో ప్రియాంక చోప్రాను తీసుకోవాలని నిర్మాతలు పట్టుపడుతున్నారు. కానీ కత్రినా కావాలని సల్మాన్ మొండిగా ఉన్నాడు అని బాలీవుడ్ మీడియా పేర్కొన్నది.

 మళ్లీ పోలీస్‌గా సల్మాన్

మళ్లీ పోలీస్‌గా సల్మాన్

అయితే దబంగ్ 3 తర్వాత వెంటనే మళ్లీ సల్మాన్ ఖాన్, ప్రభుదేవా జత కడుతున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని కథనాల్లో పేర్కొన్నారు. అయితే ఈ సినిమాలో కత్రినాకైఫ్ గానీ, జాక్వలైన్ ఫెర్నాండేజ్ గానీ నటించే అవకాశం ఉంది. అయితే భారత్ సినిమా నుంచి ప్రియాంక అనూహ్యంగా తప్పుకోవడంపై సల్మాన్ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అందుకే ప్రియాంకను తీసుకోవద్దనే మూడ్‌లో ఉన్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X