సల్మాన్ ఖాన్ హిందీ సినిమాలో బతుకమ్మ తెలుగు సాంగ్.. ఎలా ఉందంటే?
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కిసీకీ భాయ్ కిసీకీ జాన్'. తమిళ బ్లాక్ బస్టర్ 'వీరమ్' ఆధారంగా ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఫర్హాద్ షమ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమెకు సోదరుడిగా కీలక పాత్రలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న విషయం తెలిసిందే.
జగపతిబాబుతో పాటు ఈ సినిమాలో భూమిక, భాగ్యశ్రీ, మాలవిక శర్మ, అభిమన్యు సింగ్ వంటి వారు ఇతర కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటూ రిలీజ్ కు రెడీ అవుతోంది. త్వరలో ప్రత్యేకంగా ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

చాలా ఏళ్ల విరామం అనంతరం 'అనారి' తరువాత విక్టరీ వెంకటేష్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ కావడంతో తెలుగు వారికి కూడా ఈ సినిమా మీద ఆసక్తి పెరిగింది. ఇక తాజాగా సినిమా నుంచి బతుకమ్మ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ లో సింహ భాగం తెలుగు లిరిక్స్ ఉండగా కొన్ని హిందీ లిరిక్స్ కూడా ఉన్నాయి. పూజా హెగ్డే, విక్టరీ వెంకటేష్ బతుకమ్మ ఎత్తుకుని సందడిగా వెళుతున్న దృశ్యాలు కూడా కలర్ ఫుల్ గా వున్నాయి.
సాధారణంగా తెలంగాణలో బతుకమ్మకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి బతుకమ్మ పాటను పూజా హెగ్డే వెంకటేష్ తదితరులపై ఈ సినిమా కోసం షూట్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత ఈ అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సాంగ్ లో పూజ హెగ్డే తెలుగులో బతుకమ్మ పాటలు పాడుతూ డాన్స్ చేయడం కనిపిస్తోంది.
సౌత్ పైన దృష్టి పెట్టిన సల్మాన్ ఖాన్... ఇక్కడి సాంప్రదాయాలను బాగానే వాడేస్తున్నాడు అనే టాక్ వినిపిస్తుంది. ఇక ఈ మూవీకి ఏకంగా ఏడుగురు సంగీత దర్శకులు పని చేయగా ఈ పాటను కేజీఎఫ్ కంపోజర్ రవి బస్రూర్ కంపోజ్ చేశారు. సాంగ్ ఆద్యంతం ఆకట్టుకునే రీతిలో ముందుకు సాగింది.


Click it and Unblock the Notifications











