Salman Khan: గ్యాంగ్ స్టర్ నుంచి బెదిరింపులు.. తెలంగాణలో సల్మాన్ కోసం హై సెక్యూరిటీ!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చాలా కాలం తర్వాత మళ్లీ హైదరాబాద్ లో అడుగు పెట్టడం జరిగింది. తే ఈసారి ఎవరూ ఊహించని విధంగా సల్మాన్ ఖాన్ ఈ అత్యంత భారీ బందోబస్తుతో రావడం మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే అందుకు కారణం లేకపోలేదు. సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని అంటూ కొన్ని లేఖలు విడుదలయ్యాయి. అంతే కాకుండా అతని కుటుంబ సభ్యులపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు కూడా తెలియడంతో సల్మాన్ ఖాన్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో సల్మాన్ ఖాన్ కొన్ని రోజులపాటు ఉండబోతున్నాడు. దీంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

సింగర్ హత్యతో..
రీసెంట్ గా పంజాబ్ లో ప్రముఖ సింగర్ సిద్దు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇక అతని హత్య తరువాత మరికొంత మంది సెలబ్రిటీలు కూడా దుండగులు దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఊహాగానాలు వచ్చాయి. ఇక ఆ లిస్టులో సల్మాన్ ఖాన్ కూడా ఉన్నట్లుగా ఎన్నో రూమర్లు కూడా వచ్చాయి. రీసెంట్ గా వచ్చిన ఒక లేఖ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక్కసారిగా అందరినీ ఆందోళనకు గురి చేసింది. దీంతో వెంటనే ప్రముఖ సెలబ్రిటీలు అందరు కూడా అలర్ట్ అయ్యారు.

సల్మాన్ ఖాన్ ను చంపేస్తాం అంటూ..
ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ ప్రముఖ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గతంలో ఒక వీడియో కూడా విడుదల చేశాడు. ఎప్పటికైనా చంపేది నేనే ఆ వీడియోలో చెప్పగా ఇప్పుడు మరో లేఖను విడుదల చేయడం అందరినీ షాక్ కు గురి చేసింది. లేఖ ద్వారా కూడా సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని అలాగే తండ్రిని కూడా చంపేస్తామని అంటూ భయంకరమైన వార్తతో లేఖను విడుదల చేశారు. దీంతో సల్మాన్ వెంటనే అలర్ట్ అయ్యారు. పోలీసులకు కూడా సమాచారం అందించడం జరిగింది.

షూటింగ్ కోసం హైదరాబాద్
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా భారీ బందోబస్తుతో బయటకి వెళ్తున్నాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా బౌన్సర్స్ తో కాకుండా పోలీసు బందోబస్తుతో చుట్టూ కనిపిస్తున్నారు. ఇక రీసెంట్ గా హైదరాబాదులోనే షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటీ కి చేరుకున్న సల్మాన్ ఖాన్ గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ బందోబస్తు ఎంట్రీ ఇచ్చాడు.

రామోజీ ఫిలింసిటీలో సెట్
సల్మాన్ ఖాన్ కొన్ని ప్రత్యేకమైన సినిమాల షూటింగ్ కోసం హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీ కి వస్తూ ఉంటారని అందరికీ తెలిసిన విషయమే. గతంలో చాలా వరకు సల్మాన్ నటించిన సక్సెస్ ఫుల్ సినిమాలో ఇక్కడే షూటింగ్ చేసుకున్నాయి. ఇక ఇప్పుడు సల్మాన్ ఖాన్ తన తదుపరి సినిమా కబీ ఈద్ కబీ దివాలి అనే సినిమా షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిలింసిటీలో కొన్ని రోజుల పాటు జరగనుంది అందుకోసం ప్రత్యేకంగా ఒక సెట్ కూడా నిర్మించారు.

హిట్ కొట్టి చాలా రోజులైంది
బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన సల్మాన్ ఖాన్ బాక్స్ ఆఫీసు వద్ద సక్సెస్ అందుకుని చాలాకాలమయింది. అతని చివరి సినిమా రాధే ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహించాడు. ఇక తదుపరి సినిమా టైగర్ 3తో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని సిద్ధమవుతున్నాడు. ఇక లైనప్ లో ఉన్న కభీ ఈద్ కభీ దివాలి సినిమాపై కూడా సల్మాన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











