షూటింగ్ తొలి రోజే సీన్ లీక్.. స్వయంగా హీరోనే లీక్ చేసి షాక్.. ఏ మూవీ అంటే!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన దంబంగ్ సినిమాకు మరో సీక్వెల్ మొదలైంది. దంబంగ్ 3 మూవీ సినిమా షూటింగ్ ఏప్రిల్ 1న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రారంభమైంది. నర్మదా నది ఒడ్డున మొదటి రోజు షూటింగ్ చేశారు. అయితే ఈ సన్నివేశానికి సంబంధించిన సీన్‌ను స్వయంగా సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేయడంతో అభిమానులు ఊగిపోతున్నారు. వివారాల్లోకి వెళితే..

అందమైన నర్మదా నదితీరంలో
అందమైన నర్మదా నది తీరంలో సల్మాన్ ఖాన్ నడిచి వస్తుండగా కొందరు పిల్లలు నీటిలోకి దూకి ఈత కొడుతున్నారు. ఈ బ్యాక్ డ్రాప్‌తో ఉన్న ఫొటోను సల్మాన్ ఖాన్ షేర్ చేశారు. ఈ ఫోటోలో సల్మాన్ స్టయిల్ నిజంగా ఆకట్టుకొన్నది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.

ఏడేళ్ల తర్వాత చుల్‌బుల్ పాండేగా సల్మాన్
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఏడేళ్ల తర్వాత మళ్లీ చుల్‌బుల్ పాండే అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. దబంగ్3 చిత్ర షూటింగ్ సోమవారం సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్ జన్మస్థలంలో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించడం విశేషం. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తుండగా.. సోనాక్షి సిన్హా మరోసారి సల్మాన్‌తో జతకట్టింది.

పుట్టిన ఊర్లోనే.. తాత పనిచేసిన దగ్గరే షూటింగ్
దబంగ్ 3 సినిమా షూటింగ్ ప్రారంభమైనట్టు సల్మాన్ ఖాన్ తన ఇన్స్‌టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు అర్బాజ్ ఖాన్‌తో కూడిన వీడియోను షేర్ చేశారు. అర్బాజ్ ఖాన్, నేను ఎక్కడైతే పుట్టామో.. అదే ఇండోర్‌లో దంబంగ్ సినిమా షూట్‌ను మొదలుపెట్టాం. మా తాత ఎక్కడైతే పోలీస్ ఆఫీసర్‌గా నియమితుడయ్యాడో.. ఆ ప్రదేశాలైన మండలేశ్వర్, మహేశ్వర్ ప్రాంతాలకు వెళ్తున్నాం అని ఆదివారం పోస్టు చేసిన వీడియోలో సల్మాన్ అన్నారు.

ప్రభుదేవా డైరెక్టర్‌గా
బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్‌గా రూపొందిన దంబంగ్ సినిమాకు అభినవ్ కశ్యప్ దర్శకత్వం వహించారు. దబంగ్ 2 సినిమాకు అర్బాజ్ ఖాన్ డైరెక్టర్‌గా అవతారం ఎత్తారు. ఇప్పుడు ప్రభుదేవా మూడో దబంగ్‌కు శ్రీకారం చుట్టారు. ఈ చిత్ర షూటింగ్‌లో కళ్లజోడు వీపుకు పెట్టుకొని ప్రభుదేవాతో మాట్లాడుతున్న ఫోటోను సల్మాన్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











