Don't Miss!
- News నెల్లూరు జైలుకు జగన్ పై దాడి కేసు నిందితుడు సతీష్-14 రోజుల రిమాండ్..!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాలీవుడ్లో ఆ సంస్థ డ్రగ్స్ దందా! తెరపైకి సల్మాన్ ఖాన్ పేరు?.. కొత్తవాళ్లను అలా తొక్కేస్తారంటూ!
బాలీవుడ్ డ్రగ్ రాకెట్ కేసులో టాలెంట్ మేనేజ్మెంట్ సంస్థ క్వాన్ మెడకు ఈ వివాదం ఉచ్చు బిగుసుకొంటున్నది. క్వాన్‌తో సంబంధాలు ఉన్న జయ సహా, ఆ సంస్థ సీఈవో ధ్రువ్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సమన్లు జారీ చేసి విచారిస్తున్నది. ఈ క్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌పై ఆరోపణలు రావడం సంచలనం రేపింది. సల్మాన్, క్వాన్ సంస్థపై వచ్చిన ఆరోపణలు ఏమిటంటే..
టాలెంట్ మేనేజ్మెంట్ వ్యవహారాల కంటే
బాలీవుడ్లో అత్యంత గుర్తింపు ఉన్న టాలెంట్ మేనేజ్మెంట్ సంస్థల్లో క్వాన్ ఒక్కటి. అయితే బాలీవుడ్‌తో డ్రగ్ లింకులు బయటకు రావడంతో క్వాన్ పేరు తెరపైకి వచ్చింది. క్వాన్ టాలెంట్ మేనేజ్ మెంట్ వ్యవహారాల కంటే డ్రగ్స్ సరఫరా, దందాపైనే ఎక్కువగా దృష్టిపెట్టిందనే ఆరోపణలు వచ్చాయి. అయితే బాలీవుడ్లో కెరీర్ కోసం వచ్చే యువతీ, యువకులను డ్రగ్స్ దందాలోకి దించుతున్నారని సుశాంత్ సింగ్ స్నేహితుడు సంచలన విషయాలు బయటపెట్టారు.
కొత్తగా వచ్చే వారిని డ్రగ్స్ దందాలోకి
బాలీవుడ్‌లోకి కొత్త నటులు ఎవరైనా వస్తే వారిని డ్రగ్స్ ట్రేడ్‌లోకి దించుతారు. ఒకవేళ వారు నిరాకరిస్తే అలాంటి వారిని ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా బాయ్‌కాట్ చేస్తారు. సాక్ష్యాలు లభించిన క్రమంలో అలాంటి కంపెనీలను మూసివేయాలి అని సుశాంత్ స్నేహితుడు యువరాజ్ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
క్వాన్‌తో సల్మాన్ ఖాన్‌కు సంబంధాలు
బాలీవుడ్లో డ్రగ్స్ రాకెట్ కేసులో ప్రధాన క్వాన్ టాలెంట్ మేనేజ్మెంట్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో సల్మాన్ ఖాన్ పేరు తెరపైకి వచ్చింది. క్వాన్ సంస్థలో సల్మాన్ ఖాన్‌కు ప్రధాన వాటా ఉందనే వార్తలు మీడియాలో స్వైర విహారం చేశాయి. క్వాన్ సంస్థలో సల్మాన్ భాగస్వామి అనే వార్తలు ఒక్కసారి బాలీవుడ్‌ను కుదిపి వేశాయి. ఈ క్రమంలో సల్మాన్ టీమ్ ఈ వివాదంపై స్పందించింది.
Recommended Video
సల్మాన్‌కు క్వాన్‌తో భాగస్వామ్యం లేదు
క్వాన్ టాలెంట్ మేనేజ్మెంట్ సంస్థతో సల్మాన్ ఖాన్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఆయనకు ఆ సంస్థలో ఎలాంటి వాటాలు లేవు, ఆయన భాగస్వామి కూడా కాదు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే అంటూ సల్మాన్ ఖాన్ టీమ్ అధికారికంగా ప్రకటన చేసింది. అయితే క్వాన్ సీఈవోను ధ్రువ్‌ను బుధవారం విచారిస్తున్నందున్న క్వాన్ కార్యకలాపాలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందనే మాట మీడియాలో బలంగా వినిపిస్తున్నది.