ఆ హీరోయిన్‌తో సల్మాన్ ఖాన్ పెళ్లి.. షాక్‌లో అభిమానులు.. అసలు నిజం ఏమిటంటే?

మీడియాలో తరచూ సెలబ్రిటీల మధ్యలో ఏదో నడుస్తుంది అని వార్తలు రావడం సహజమే. కొన్నిసార్లు అవి నిజం కావచ్చు మరికొన్నిసార్లు అబద్ధాలు కూడా కావచ్చు. ఎక్కువసార్లు అయితే అవన్నీ కూడా పుకార్లే అని కూడా అర్థమవుతుంది. ఇక కొంత మంది సినీ తారలు సీక్రెట్ గా వివాహం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అదే తరహాలో సల్మాన్ ఖాన్ కూడా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇక రీసెంట్ గా సల్మాన్ ఖాన్ దబాంగ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను కూడా పెళ్లి చేసుకున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక అది నిజమా కాదా? అనే వివరాల్లోకి వెళితే..

సల్మాన్ జీవితంలో..

సల్మాన్ జీవితంలో..

ఇండియన్ స్టార్ సెలబ్రిటీస్ లలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయినటువంటి సల్మాన్ ఖాన్ గురించి అందరికీ తెలిసిందే. గతంలో చాలా బ్రేకప్ అనుభవాలను కూడా అతను ఎదుర్కొన్నాడు. ఒక స్టార్ హీరోయిన్ తో కూడా ప్రేమ నుంచి పెళ్లి వరకు వెళ్లినట్లు టాక్ వచ్చింది. ఇక సల్మాన్ ఫైనల్ గా కొందరు చేసిన మోసాలకు తట్టుకోలేకనే పెళ్లి అనే బంధానికి కూడా దూరమయ్యాడు అని చెబుతూ ఉంటారు. సల్మాన్ ఖాన్ కూడా పలు ఇంటర్వ్యూలలో ప్రేమ పెళ్లి బంధం చాలా సెన్సిటివ్ అని వాటిని లైఫ్ లాంగ్ కొనసాగించాలి అంటే చాలా కష్టమైన పని అని చెప్పుకొచ్చాడు.

ఆ హీరోయిన్ వల్లే పెళ్లికి దూరం..

ఆ హీరోయిన్ వల్లే పెళ్లికి దూరం..

ఏదేమైనా సరే సల్మాన్ జీవితంలో మాత్రం కొన్ని లవ్ స్టోరీలు అప్పట్లో చాలా వైరల్ అయ్యాయి. ఒక స్టార్ హీరోయిన్ కారణంగానే అతడు పెళ్లి అనే మాటను కూడా దూరమయ్యాడు అని టాక్ వచ్చింది. సల్మాన్ ఖాన్ కొత్త హీరోయిన్స్ తో నటించడానికి ఎక్కువగా ఇష్ట పడుతూ ఉంటాడు. ఇక సల్మాన్ ఖాన్ ప్రతిసారి వారితో ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు కూడా చాలానే వస్తూ ఉంటాయి.

దబాంగ్ హీరోయిన్ తో ప్రేమలో

దబాంగ్ హీరోయిన్ తో ప్రేమలో

అయితే సల్మాన్ ఖాన్ దబాంగ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాతో కూడా కొన్నాళ్ళు ప్రేమలో ఉన్నట్లు అనేక రకాల వార్తలు వెలువడ్డాయి. ఇక ఆ స్టార్స్ ఆ విషయంపై పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా సోనాక్షి నోట్ బుక్ యాక్టర్ జహీర్ ఇక్బాల్ తో కూడా ప్రేమలో ఉన్నట్లు టాక్ వచ్చింది. కానీ అవన్నీ అబద్ధాలు అని సోనాక్షి సిన్హా కొట్టిపారేసింది.

వీడియోలు ఫొటోలు వైరల్

వీడియోలు ఫొటోలు వైరల్

ఇక రీసెంట్ గా సోనాక్షి సిన్హా సల్మాన్ ఖాన్ ఇద్దరికీ కూడా పెళ్లి జరిగినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం అందరూ షాక్ అయ్యారు. అంతేకాకుండా ఫోటోలు కూడా చాలానే వైరల్ అయ్యాయి కానీ ఆ విషయంపై సల్మాన్ ఖాన్ సోనాక్షి సిన్హా కూడా పెద్దగా స్పందించలేదు.

Recommended Video

Salman Khan Winning Hearts | కర్ణాటక లో ఓ విద్యార్థి తండ్రి చనిపోతే..!! || Filmibeat Telugu
అసలు నిజం.. ఏమిటంటే?

అసలు నిజం.. ఏమిటంటే?

ఇక ఫైనల్ గా ఆ ఫోటోలు వీడియోలు ఎక్కడివి అనే వివరాల్లోకి వెళితే.. కావాలని కొంతమంది నెటిజన్లు ఫోటోషాప్ లో చేసినవని తేలిపోయింది. గతంలో కూడా సల్మాన్ ఖాన్ కొంతమంది హీరోయిన్స్ ను పెళ్లి చేసుకున్నట్లు ఫేక్ ఫోటోలను ఇంటర్ నెట్ లో వైరల్ అయ్యేలా చేశారు. ఇక ఇప్పుడు కూడా సోనాక్షిసిన్హా అయినట్లుగానే ఫేక్ ఫొటోలను సృష్టించారు. ఇక వాటిని గమనిస్తే అవి మొత్తం కూడా ఫేక్ అని తేలిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X