నడిరోడ్డులో సల్మాన్ ఖాన్ అలా.. కేసు నమోదు.. బాడీ గార్డ్స్ ఏం చేశారంటే!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు వివాదాలేమీ కొత్త కాదు. బాలీవుడ్ లో తిరుగులేని స్టార్ గా కొనసాగుతూనే సల్మాన్ ఖాన్ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటుంటారు. సల్మాన్ ఖాన్ తాజాగా మరో కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. సల్మాన్ ఖాన్ బయట కనిపిస్తే జనాలు చూసేందుకు ఎగబడడం సహజమే. అదే ప్రస్తుతం సల్మాన్ కు చిక్కులు తెచ్చిపెట్టింది. సల్మాన్ ఖాన్ ఓ జర్నలిస్ట్ తో అనుచితంగా ప్రవర్తించినట్లు కేసు నమోదైంది. ఈ సంఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం!

సైక్లింగ్ చేస్తుండగా
సల్మాన్ ఖాన్ బుధవారం రోజు ముంబైలోని లింకింగ్ రోడ్డు వద్ద సైక్లింగ్ చేస్తున్నపుడు ఈ సంఘటన జరిగింది. సల్మాన్ ఖాన్ ఓ జర్నలిస్ట్ తో అనుచితంగా ప్రవర్తించి అతడి ఫోన్ లాక్కున్నాడని కేసు నమోదైంది. ఈ మేరకు భాదితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇక సల్మాన్ ఖాన్ బాడీ గార్డులు కూడా సదరు వ్యక్తిపై తిరిగి క్రాస్ కంప్లైంట్ చేశారు.

వీడియో తీయడానికి
భాదితులు చెబుతున్న వివరాల ప్రకారం.. తాము జుహు నుంచి కందవిళి వెళుతుండగా సల్మాన్ ఖాన్ ని చూశాం అని తెలిపారు. ఆ సమయంలో సల్మాన్ సైక్లింగ్ చేస్తున్నారు. చుట్టూ ఆయన బాడీగార్డులు ఉన్నారు. సల్మాన్ ఖాన్ వీడియో తీసుకుంటాం అని బాడీగార్డుల అనుమతి అడిగాం. వారు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. వారు అనుమతి ఇవ్వడంతోనే తాము వీడియో తీశాం అని సదరు వ్యక్తి తెలిపాడు. కానీ సల్మాన్ ఖాన్ తన బాడీ గార్డుల వంక చూసి సైగ చేశాడు. వారు మా వద్దకు వచ్చి అమర్యాదగా ప్రవర్తించారని సదరు వ్యక్తి తెలిపాడు.

ఫోన్ లాక్కుని
ఇంతలో ప్రభాస్ మా వద్దకు ఫోన్లు లాక్కున్నారు. తాను జర్నలిస్ట్ అని చెప్పినా వినిపించుకోలేదని సదరు వ్యక్తి వాపోతున్నాడు. తన పక్కనే ఉన్న సహ ఉద్యోగిని కూడా ఇబ్బంది పెట్టారని అతడు తెలిపాడు. ఫోన్ ఇవ్వాలని అడిగితే గెంటివేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. సల్మాన్ ఖాన్ బాడీ గార్డులు కూడా అతడిపై తిరిగి కేసు నమోదు చేశారు. తమ అనుమతి లేకుండా సల్మాన్ ఖాన్ ని చాలా దూరం ఫాలో అయ్యారని, ఫోన్ తో వీడియోలు తీసేందుకు ప్రయత్నించారని సల్మాన్ బాడీగార్డులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

క్రేజీ చిత్రాలు
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నారు. అలీ అబ్బాస్ దర్శకత్వంలో నటించిన భారత్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో సల్మాన్, కత్రినా జంటగా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది. ఇక దబాంగ్ 3 చిత్రం కూడా ఇటీవలే ప్రారంభమైంది. ప్రభుదేవా ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో కూడా సోనాక్షి సిన్హానే హీరోయిన్.


Click it and Unblock the Notifications











