Salman Khan లేటేస్ట్ అఫైర్.. డేటింగ్‌పై హాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్లారిటీ.. ఎవరీ సమంత?

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ జీవితంలో అఫైర్, డేటింగ్ వార్తలు పుష్కలంగా మీడియాలో హడావిడి చేస్తుంటాయి. ఏడాదికో ఓ అఫైర్ వార్త మీడియాలో హల్‌చల్ చేస్తుంటుంది. 2022 సంవత్సరం ఆరంభమైందో లేదో ఓ హాలీవుడ్‌ హీరోయిన్‌తో సల్మాన్ ఖాన్ డేటింగ్ చేస్తున్నారు అనే వార్త మీడియాలో వైరల్ అయింది. అయితే సల్మాన్ ఖాన్ క్లారిటీ ఇవ్వలేదు కానీ.. హాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత లాక్‌ఉడ్ మాత్రం డేటింగ్ వ్యవహారంపై పెదవి విప్పింది. సమంత చెప్పిన విషయాలు ఏమిటి? సల్మాన్ డేటింగ్, అఫైర్ లైఫ్ గురించి వివరాల్లోకి వెళితే..

సల్మాన్ ఖాన్ జీవితంలో అఫైర్లు

సల్మాన్ ఖాన్ జీవితంలో అఫైర్లు

సల్మాన్ ఖాన్ జీవితంలో అఫైర్ల వివరాల్లోకి వెళితే.. సంగీత బిజ్లానీ, ఐశ్వర్యరాయ్, ఫారియా ఆలమ్, సోమీ ఆలీ, కత్రినా కైఫ్, ఇలియా వాంటర్‌, జాక్వలైన్ ఫెర్నాండేజ్‌తో డేటింగ్ చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా సంగీత బిజ్లానీతో పీకల్లోతూ ప్రేమలో ఉండటం సుదీర్ఘ కాలంగా సాగింది. ఆ తర్వాత ఐశ్వర్యరాయ్‌తో, కత్రినా కైఫ్‌తో రిలేషన్‌షిప్ పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది. తాజాగా సమంత లాక్ఉడ్ పేరు తెరపైకి వచ్చింది.

బర్త్ డే పార్టీలో సమంత లాక్‌ఉడ్

బర్త్ డే పార్టీలో సమంత లాక్‌ఉడ్

నూతన సంవత్సరం వేడుకలకు ముందు సల్మాన్ ఖాన్ ముంబైకి సమీపంలోని పాన్వెల్‌లోని తన ఫామ్‌హౌజ్‌లో బర్త్ డే వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. పాన్వెల్‌ ఫామ్‌హౌజ్‌లో సమంత లాక్ఉడ్ కనిపించడం స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. దాంతో వారిద్దరి మధ్య డేటింగ్ జరుగుతుందనే వార్తలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. అయితే ఆ వార్తలపై బాలీవుడ్ మీడియాకు సమంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

సల్మాన్ అంటే ఇష్టం.. కానీ

సల్మాన్ అంటే ఇష్టం.. కానీ

సల్మాన్‌తో డేటింగ్ గురించి క్లారిటీ ఇస్తూ.. సల్మాన్ ఖాన్‌తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు నా దృష్టికి వచ్చాయి. మీడియాలో చాలా కథనాలు నేను చేశాను. కానీ మా మధ్య అలాంటి వ్యవహారం లేదు. సల్మాన్ మంచి వ్యక్తి. పాన్వెల్ ఫామ్‌హౌజ్‌లో కలిసింది నిజమే. అయితే మా మధ్య ఇలాంటి రిలేషన్ ఉందనే వార్త ఎలా పుట్టిందో అర్ధం కావడం లేదు. బాలీవుడ్ అంటే ఇష్టం. సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమా అంటే మరీ ఇష్టం అని సమంత లుక్‌ఉడ్ పేర్కొన్నది.

సల్మాన్ పార్టీలో కొత్త అనుభూతికి

సల్మాన్ పార్టీలో కొత్త అనుభూతికి

సల్మాన్‌తో తన అనుబంధం గురించి చెబుతూ.. సల్మాన్ ఖాన్‌తో చాలా రోజుల నుంచి నాకు పరిచయం ఉంది. ఒకట్రెండు సార్లు కలిశాను. సల్మాన్ ఖాన్ బర్త్ డే పార్టీ రోజున ఆయనను కలిశాను. అక్కడికి వచ్చిన అతిథుల్లో నేను ఒకరిని. ఆ పార్టీకి వచ్చిన వారెవరూ నాకు తెలియదు. ఆ పార్టీలో కొంతమందిని కలువడంతో హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు పరిచయం అయ్యారు. సల్మాన్ పార్టీలో పాల్గొనడం కొత్త అనుభూతి అని సమంత లాక్‌ఉడ్ తెలిపింది.

Recommended Video

Salman Khan Winning Hearts | కర్ణాటక లో ఓ విద్యార్థి తండ్రి చనిపోతే..!! || Filmibeat Telugu
సమంత లాక్ఉడ్ ఎవరంటే?

సమంత లాక్ఉడ్ ఎవరంటే?

సమంత లాక్‌ఉడ్ విషయానికి వస్తే.. 38 ఏళ ఈ గ్లామర్ హీరోయిన్ అమెరికా నటిగా, మోడల్‌గా రాణిస్తున్నారు. అందం, అభినయం ఉన్న టాలెంటెడ్ హీరోయిన్ అనే గుర్తింపు ఉంది. కాలిఫోర్నియా శాంతాక్రజ్ యూనివర్సిటీలో యాక్టింగ్ కోర్సు పూర్తి చేసింది. టర్న్ బ్లాక్ నౌ అనే చిత్రం ద్వారా హాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత సై ఫైటర్, మెక్సికన్ గోల్డ్ అనే చిత్రాల్లో నటించి సక్సెస్‌ను చేజిక్కించుకొన్నది. ప్రస్తుతం ఆమె నటించిన షూట్ ది హీరో అనే చిత్రం ద్వారా మరోసారి మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X