twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్లో మోషన్‌లో అడుగుపెట్టిన సల్మాన్.. వైరల్ వీడియో

    |

    స్లో మోషన్‌మే అంటూ భారత్ సినిమాలో అదిరిపోయే స్టెప్పులేశాడు సల్మాన్ ఖాన్. తన కొత్త సినిమా షూటింగ్ కోసం.. అదే స్లో మోషన్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేశాడు. ప్రభుదేవా డైరెక్షన్‌లో రాబోతోన్న దబాంగ్3తో వసూళ్ల సునామి సృష్టించేందుకు సిద్దమైన ఈ కండలవీరుడు.. మరో ప్రాజెక్ట్‌ను కూడా లైన్లో పెట్టేశాడు. ప్రభుదేవా, సల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో 'రాధే:యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్'అనే మరో మూవీ షూటింగ్ కూడా ప్రారంభమైంది.

    షూటింగ్ మొదటి రోజు సెట్‌లోకి అడుగుపెట్టిన వీడియోను పోస్ట్ చేశాడీ సూపర్ స్టార్. సినిమా సెట్స్ లోకి వెళ్తోన్న సమయంలో తీసిన వీడియోను సల్మాన్ ఖాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. స్లో మోషన్ లో సెట్స్ లోకి నడుచుకుంటూ వెళ్తూ ఆయన కనపడుతున్నాడు. అయితే, తన ముఖ భాగాన్ని మాత్రం ఆయన చూపించలేదు. 'రాధే ఈద్2020.. తొలిరోజు' అంటూ సల్మాన్ ఖాన్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. అలాగే, నిన్న చిత్రీకరించిన ముహూర్తపు షాట్ క్లాప్ కొట్టిన ఓ ఫొటోను కూడా షేర్ చేశాడు.

    Salman Khan On Set Radhe Movie First Day Shooting

    సల్మాన్ తో పాటు ఈ సినిమాలో దిశా పటానీ, రణ్ దీప్ హూడా ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ప్రభుదేవా, సల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో ఇప్పటికే వాంటెడ్ సినిమా వచ్చింది. ప్రభుదేవా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సల్మాన్ 'దబాంగ్ 3' సినిమా వచ్చేనెల 20న విడుదల కానుంది. ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీ వచ్చే ఏడాది రంజాన్ కానుకగా విడుదల కానుంది.

    English summary
    Salman Khan On Set Radhe Movie First Day Shooting. He Tweet ABout Movie Shootong. Slow Motion Video Goes viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X