For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చూడగానే అలా అనిపించింది.. అందుకే 'దిశ'కి ముద్దు… ఓపెన్ అయిపోయిన సల్మాన్!

  |

  ప్రతి ఏడాది రంజాన్‌కి ఒక సినిమా రిలీజ్ చేయడం అనేది సల్మాన్ ఖాన్ కి అలవాటు. గత ఏడాది లాక్ డౌన్ కారణంగా సల్మాన్ మూవీ విడుదల చేయలేదు. దీంతో సల్మాన్ ఖాన్ నుంచి సినిమా వచ్చి చాలా రోజులు అవుతోంది. దీంతో రాధే సినిమాతో ఈసారి అయినా ప్రేక్షకులను సినిమాతో పలకరించాలని సల్మాన్ భావిస్తున్నారు. అయితే సల్మాన్ ఖాన్ తన కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై లిప్ లాక్ చేయడం చర్చనీయాంశమైంది. తాజాగా ఆయన ఈ అంశం మీద స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే..

  లిప్ లాక్ ఫర్ ఫస్ట్ టైం

  లిప్ లాక్ ఫర్ ఫస్ట్ టైం

  దర్శకుడిగా మారిన కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ ఈ మధ్యనే విడుదలయ్యింది. ఈ రాధే ట్రైలర్ విపరీతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. సినిమాలో సల్మాన్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ లో సల్మాన్ ఖాన్ హీరోయిన్ దిశా పటానిని ముద్దు పెట్టుకున్నారు. ఇదే సంచలనంగా మారింది.

  దానికి రీజన్ ఏంటంటే తనదైన డైలాగ్స్‌, యాక్షన్స్, రొమాంటిక్ సీన్లతో అదరగొట్టే సల్మాన్ ఖాన్ ఎప్పుడూ ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కు దూరంగానే ఉంటారు. ఇప్పటి దాకా సినిమాలో హీరోయిన్లతో లిప్‌లాక్స్‌ చేసిన దాఖలాలు లేవు. అలాంటిది ఈ సినిమాలో దిశకి లిప్ లాక్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

  అసలు సీక్రెట్ అదే

  అసలు సీక్రెట్ అదే

  తాజాగా ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్ గురించి కీలక కామెంట్స్ చేశారు సల్మాన్. ఈ సినిమాలో ఒక లిప్ లాక్ ఉందని కానీ అందులో కూడా ఒక ట్విస్ట్ ఉందని అన్నారు. ''నేను దిశా పెదవులపై కాకుండా ఆమె పెదవులకు వేసిన టేప్ మీద ముద్దుపెట్టుకున్నాను'' అని అన్నారు. ముద్దు సీన్ ఉండాల్సిందే అని అనడంతో అలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అంతే కాక ఆమె కూడా తన వయసులోనే ఉన్నట్టు తనకు అనిపించిందని పేర్కొన్నారు. ఆమె కూడా నా వయస్సు చూడలేదు, నేను కూడా ఆమె వయుసులోనే ఉన్నట్టు ఆమెకు కనిపించాను, "అని సల్మాన్ పేర్కొన్నాడు.

  ప్రపంచాన్ని పట్టించుకోడు

  ప్రపంచాన్ని పట్టించుకోడు

  ఇక అంతకుముందు, దిశా కూడా సల్మాన్‌పై ప్రశంసలు కురిపించింది. ఈ సినిమాలో సీటీమార్ సాంగ్ కోసం సల్మాన్ తో డ్యాన్స్ వేయడం గురించి ఆమె ఆసక్తికరంగా స్పందించింది. సల్మాన్ సార్‌తో కలిసి పనిచేయడం ఎల్లప్పుడూ చాలా సరదాగా ఉంటుంది. ఆయన డ్యాన్స్ చేసినప్పుడు, అతనికి ప్రపంచంతో పని లేదు, ఎవరూ చూడటం లేదు అని ఫీల్ అయి డ్యాన్స్ చేస్తారని ఆమె చెప్పుకొచ్చింది. ఇలా చేయడం ఆయనకే సాధ్యం, మరెవరూ ఇలా చేయలేరు ఏమో అని ఆమె చెప్పుకొచ్చింది.

  మీ ఇంటికి వచ్చి మా సినిమా చూపిస్తున్నాం

  మీ ఇంటికి వచ్చి మా సినిమా చూపిస్తున్నాం

  ఇక ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ రాధే సినిమాపై అంచ‌నాలు కూడా బాగానే ఉన్నాయి. రంజాన్ సంద‌ర్భంగా మే 13న రాధే సినిమాను తీసుకొస్తున్నారు. అయితే ఈ సినిమాను థియేట‌ర్స్‌తో పాటు ఒకేసారి ఓటీటీలో కూడా విడుదల చేయబోతున్నారు నిర్మాతలు. ప్రస్తుతానికి ఇది కొత్త పద్ధతి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేటర్స్ వరకు వచ్చి ప్రేక్షకులు సినిమా చూడలేరు కాబట్టి మీ ఇంటికి వచ్చి మా సినిమా చూపిస్తున్నామంటూ ప్రమోషన్ చేసుకుంటున్నారు సల్మాన్ ఖాన్.

  Seeti Maar From Radhe Released - Allu Arjun Reacts | Filmibeat Telugu
  ఏమవుతుందో

  ఏమవుతుందో

  ఈ సినిమాను మే 13న థియేటర్‌తో పాటు జీ ప్లెక్స్ లో కూడా విడుదల చేస్తున్నారు. అయితే రాధే సినిమా చూడాలంటే అక్షరాలా 249 రూపాయలు చెల్లించాలి. అంటే ఒక్కసారి సినిమా చూడాలన్నా ప్రతీ సారీ వినియోగదారుడు ₹249 చెల్లించాలి. అయితే మామూలు ఓటీటీలో చాలా సార్లు చూడడానికి అలవాటు పడిన వాళ్ళు ఇప్పుడు రాధే సినిమాను ఆదరిస్తారా ?లేదో అనేది చూడాలిక.

  English summary
  B-town’s Superstar, Salman Khan is coming up with his much-awaited cop drama Radhe: Your Most Wanted Bhai on Eid this year.In his recent interview salman opened up about the most-talked-about scene from Radhe. Talking about this, Salman said there is a twist in it. I kissed Disha on tape, not on her lips.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X