బాలీవుడ్‌లోకి మహర్షి.. సల్మాన్ ఖాన్ హీరోగా దిల్ రాజు రీమేక్.. ప్రభుదేవాతో కలిసి..
Recommended Video
సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం భారీ అంచనాలు, క్రేజ్ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశంలోని అన్ని సినిమా పరిశ్రమల చూపంతా ఈ సినిమాపైనే ఉండటంతో మరింత ఆసక్తిని రేపింది. అయితే ఈ సినిమాను బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్టు హిందీ మీడియా కథనాలు వెల్లడించింది. దక్షిణాదిలో ఇతర హీరోలు కూడా ఈ సినిమా రీమేక్ హక్కులపై దృష్టిపెట్టడంతో మరింత క్రేజ్‌గా క్రియేట్ చేస్తున్నది. వివరాల్లోకి వెళితే..

మహర్షి మూవీపై సల్మాన్ ఖాన్ దృష్టి
మహర్షి సినిమా రిలీజ్‌కు ముందు నుంచే సల్మాన్ ఖాన్ దృష్టిపెట్టాడనేది సినీ వర్గాల సమాచారం. ఒకవేళ సినిమా మంచి విజయం సాధిస్తే గ్యారెంటీగా హిందీలో చేయడానికి రెడీగా ఉన్నారట. టీజర్లు, ట్రైలర్ల రిలీజ్ తర్వాత సినిమా కంటెంట్ సల్మాన్ విపరీతంగా ఆకర్షించిందట. దాంతో మహర్షి సినిమాను తప్పనిసరిగా హిందీలో తీయాలని ప్లాన్ చేస్తున్నారట.

ప్రభుదేవాతో కలిసి చూసేందుకు
మహర్షి సినిమాను ముంబైలో దర్శకుడు ప్రభుదేవాతో కలిసి సల్మాన్ ఖాన్ చూసేందుకు ఏర్పాట్లు చేశారట. ప్రస్తుతం దబంగ్ 3 చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చూసిన తర్వాత మహర్షిపై పక్కగా ఓ క్లారిటీతో నిర్ణయం తీసుకొంటారని బాలీవుడ్ మీడియా వెల్లడించింది. గతంలో మహేష్ నటించిన పోకిరి చిత్రాన్ని వాంటెడ్‌గా హిందీలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.

దిల్ రాజు నిర్మాతగా
మహర్షి సినిమాను బాలీవుడ్ నిర్మాత బోనికపూర్‌తో కలిసి దిల్ రాజు హిందీ రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట. సల్మాన్ ఖాన్ నిర్ణయం కోసం దిల్ రాజ్ వెయిట్ చేస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఇటీవల తెలుగులో విజయం సాధించిన F2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ చిత్రాన్ని బోని కపూర్‌తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

విజయ్ హీరోగా తమిళ భాషల్లోకి
ఇక మహర్షి సినిమాను తమిళంలో రీమేక్ చేసేందుకు థలపతి విజయ్ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను తమిళంలో రూపొందించేందుకు ప్రకటన కూడా చేశాడు. వాస్తవానికి మహర్షి తెలుగుతోపాటు తమిళంలో కూడా విడుదలైంది. అయినా ఈ సినిమా కంటెంట్ తెలుసుకొని విజయ్ ఫిదా అయినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











