గ్యాప్ లేకుండా పెట్టేస్తున్నాడు.. ముద్దుల వర్షంలో తడిపేస్తోన్న సల్మాన్!!
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో కొంత సమయాన్ని గడిపేస్తాడు. చెల్లెలి కుటుంబంతో టైమ్ గడుపుతూ అల్లుడుతో ఆడుకుంటాడు. సోదరి అర్పితా ఖాన్ తాజాగా షేర్ చేసిన మామ కోడలు చేష్టలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ వీరిద్దరు ఏం చేశారో ఓ సారి చూద్దాం.

హైద్రాబాద్‌లో ఘనంగా వివాహం..
సల్మాన్ తన సోదరి అర్పిత వివాహాన్ని.. హైదరాబాదులోని ఫలక్ నుమా ప్యాలెస్‌లో అంగరంగవైభవంగా జరిపించిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సుఖ్ రామ్ మనవడైన ఆయుష్ శర్మను పెళ్లాడిందామె. ఈ దంపతులకు ఆహిల్, ఆయత్ అనే పిల్లలున్నారు.

బావను హీరోగానూ..
తన బావ ఆయుష్ శర్మను బాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇప్పించాడు. నిర్మాతగా మారి లవ్ రాత్రి అనే చిత్రంతో హీరోగా పరిచయం చేశాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండిగ. అది వేరే విషయం.
ఆడుతూ పాడుతూ..
సల్మాన్ ఖాన్ తన అల్లుడితో ఆడుతూ పాడుతూ ఉంటాడు. వీరిద్దరు చేసే అల్లరి సోషల్ మీడియాలోనూ ఫేమస్సే. అయితే తాజాగా వారి ఇంట్లోకి వచ్చింది ఆయత్. ఇక మేనకోడలు (ఆయత్) ఇంట్లోకి రావడంతో ఆనందం రెట్టింపైంది.
Recommended Video


ముద్దుల వర్షంలో..
మామ సల్మాన్ ఖాన్ కోడలు అయత్‌కు ప్రేమగా ముద్దులు పెడుతున్నాడు. కోడలితో ఆడుకుంటున్న ఈ వీడియోను సోదరి అర్పితా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇదే వీడియోను సల్మాన్ కూడా రీపోస్ట్ చేశాడు. ఇక మామ కోడళ్ల ప్రేమకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. సల్మాన్ ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో రాధే సినిమాను చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











