twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్ ది గ్రేట్.. నేరుగా ఖాతాలోకే డబ్బులు.. ఎన్ని వేల మందికి సహాయమంటే?

    |

    ఆపద సమయంలో ఆదుకొనే విషయంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తనకు తానే సాటి అని పలుమార్లు నిరూపించుకొన్నారు. దేశవ్యాప్తంగా కరోనావైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో సినీ పరిశ్రమ కార్యకలాపాలు స్తంభించాయి. ఈ క్రమంలో రోజూవారీ వేతన కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. సినీ కార్మికుల బాధలపై సల్మాన్ ఖాన్ స్పందించిన తీరుపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. వివరాల్లొకి వెళితే..

    5 లక్షల మంది వేతన కార్మికులు

    5 లక్షల మంది వేతన కార్మికులు

    సినీ పరిశ్రమలోని రోజువారీ వేతన కార్మికులకు సల్మాన్ ఖాన్ స్థాపించిన స్వచ్ఛంద సంస్త బీయింగ్ హ్యూమన్ రంగంలోకి దిగింది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మొత్తం 5 లక్షల మంది రోజువారీ వేతన కార్మికులు ఉన్నారు. వారిలో కొందరు మాతో మాట్లాడారు. అయితే ఇప్పటికిప్పుడు అత్యవసరం ఉన్న 25 వేల మంది వేతన కార్మికులను ఆదుకోవాలని సల్మాన్ ఖాన్ నిర్ణయించారు అని తెలిపారు.

    25 వేల మందికి ఆర్థిక సహాయం

    25 వేల మందికి ఆర్థిక సహాయం

    బాలీవుడ్‌లోని అత్యవసరమైన కార్మికుల వివరాలు సేకరిస్తున్నాం. వారి బ్యాంక్ ఖాతా నంబర్లను పంపించమని అడిగాం. వారి అకౌంట్లకే డబ్బుల్ని నేరుగా పంపిస్తున్నాం. డబ్బులు మధ్యవర్తుల కారణంగా ఆగిపోకుండా, అందకుండా ఉండే పరిస్థితులను నివారించడానికే నేరుగా వారి అకౌంట్లనే డబ్బుల వేస్తున్నాం అని బీయింగ్ హ్యూమన్ నిర్వాహకులు తెలిపారు.

     యువ హీరో కార్తీక్ ఆర్యన్ కోటి సహాయం

    యువ హీరో కార్తీక్ ఆర్యన్ కోటి సహాయం

    ఇదిలా ఉండగా, యువ నటుడు కార్తీక్ ఆర్యన్ కూడా సినీ వేతన కార్మికులను ఆదుకోనేందుకు రంగంలోకి దిగారు. తన వంతుగా బాధ్యతగా కార్తీక్ ఆర్యన్ రూ.1 కోటిని విరాళంగా ప్రకటించారు. ఇప్పటికే ప్రొడ్యూసర్స్ గిల్డ్ సహాయ కార్యక్రమాలను చేపట్టింది.

    Recommended Video

    World Wild Life Day 2020 : Celebrities Love Towards Wild Life
    కదిలిన బాలీవుడ్

    కదిలిన బాలీవుడ్

    ఇప్పటికే బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ తదితరులు భారీ విరాళాన్ని అందించారు. అక్షయ్ కుమార్ రూ.25 కోట్లు ప్రధాని నిధికి సహాయం అందించిన సంగతి తెలిసిందే. ఇంకా పలువురు తమకు తోచిన విధంగా విరాళాలను ప్రకటిస్తున్నారు.

    English summary
    Bollywood actor Salman Khan pledged 25,000 daily wage workers thru his Being Human Charity. Being Human organisers asked for account details of these 25,000 workers as they want to ensure that money reaches them directly,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X