twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత.. సల్మాన్ ఖాన్‌తో..

    |

    హిందీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాత విజయ్ గిలానీ ఇక లేరు. కొద్దికాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ లండన్‌లో తుదిశ్వాస విడిచారు. విజయ్ గలానీ మరణవార్తతో బాలీవుడ్ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. విజయ్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటున్నారు. విజయ్ మరణవార్తను దర్శకుడు అనిల్ శర్మ, నిర్మాత రమేష్ తౌరానీ సోషల్ మీడియాలో ధృవీకరించారు.

    మూడు నెలల క్రితం విజయ్ గలానీకి బ్లడ్ క్యాన్సర్ అని తేలడంతో చికిత్స కోసం లండన్‌లోని స్థానిక హాస్పిటల్‌లో చేర్పించారు. ఆయనకకు అక్కడ బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. అయితే ఆరోగ్య కుదుటపడుతున్నదని అనుకొంటున్న సమయంలోనే ఆయన మృతి చెందడం కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు షాక్ గురయ్యారు. లండన్ నుంచి మూడు రోజుల క్రితమే వచ్చిన ఆయన కుమారుడు ప్రతీక్ గలానీ.. తండ్రి వార్త తెలియగానే హుటాహుటిన లండన్‌కు బయలుదేరి వెళ్లారు.

    గతంలో సల్మాన్ ఖాన్‌తో ఆయన వీర్ అనే సినిమాను, అలాగే అమితాబ్ బచ్చన్‌తో సూర్యవంశీ అనే చిత్రాన్ని విజయ్ గలానీ తెరకెక్కించారు. వీర్ సినిమాకు దర్శకత్వం వహించిన అనిల్ శర్మ.. మీడియాలో స్పందిస్తూ.. విజయ్ మరణంతో గుండె ముక్కలైనంత పని అయింది. ఆయన అద్భుతమైన వ్యక్తి. ఆయనతో గొప్ప రిలేషన్ ఉంది అని తెలిపారు.

    Salman Khans Producer Vijay Galani no more: Dies at London due to blood Cancer

    విజయ్ గిలాని మరణ వార్తను నిర్మాత రమేష్ తౌరానీ స్పందించారు. విజయ్ లేరనే వార్తను తెలియజేయడానికి చాలా బాధగా ఉంది. ఆయన మరణం దురదృష్టకరం, ఎవరూ పూడ్చలేని విషాదం. ఆయన మరణంతో విషాదంలో కూరుకుపోయిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సంతాపం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి అంటూ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.

    బాలీవుడ్‌లో విజయ్ గలానీ సుదీర్ఘ కాలంగా సినీ నిర్మాణంలో ఉన్నారు. అక్షయ్ కుమార్‌తో అజ్నబీ, శృతిహాసన్‌తో ది పవర్ అనే చిత్రాన్ని నిర్మించారు. లవ్ శుద్ద, బచ్కే రహ్నా రే బాబా, అచానక్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

    English summary
    Producer Vijay Galani death news: Ramesh Taurani posted that in Instagram and wrote, “Very unfortunate and sadding to know our dear friend Vijay Gallani passed away.. May his soul rest in peace.. deepest condolences to his family and friends.. Shanti.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X