నటుడి మెడపై కత్తిపెట్టిన సల్మాన్ ఖాన్.. పాత్రలో లీనమైపోయి రక్తం వచ్చిన విడిపెట్టకుండా
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు దక్షిణాదిలోనూ మంచి క్రేజ్ ఉంది. ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. సల్మాన్ ఖాన్ చిత్రాలన్నీ దాదాపు తెలుగులోనూ డబ్డ్ వెర్షన్ లో విడుదలవుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ కారణంగా సల్మాన్ ఖాన్ కు సౌత్ లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. బాయ్ జాన్ చిత్రాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక రీసెంట్ గా సల్మాన్ ఖాన్ సికిందర్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు సల్మాన్ ఖాన్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదొక ఇంట్రెస్టింగ్ మేటర్ వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలో బాలీవుడ్ కమెడియన్, నటుడు అశోక్ సరఫ్ ఓ భయంకర ఘటనను వివరించారు. ఆ వివరాల్లోకి వెళితే..
3 దశాబ్దాలుగా..
నార్త్ ప్రేక్షకులను సల్మాన్ ఖాన్ 3 దశాబ్దాలుగా అలరిస్తున్నారు. బీవీ హో తో ఐసీ అనే చిత్రంలో తొలుత పాత్రలో మెరిసి సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ చిత్రం 1988లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత సూరజ్ బర్జాత్య దర్శకత్వం వహించిన మైనే ప్యార్ కియా చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రం 1989తో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటి నుంచి 2025 వరకు 120కిపైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. 35 ఏళ్లుగా వెండితెరపై విభిన్న పాత్రలు, విభిన్న జోనర్లలో నటిస్తూ ఆకట్టుకుంటూనే వస్తున్నారు.

కమెడియన్ మెడపై కత్తి..
బాలీవుడ్ లో గొప్ప నటుడిగా, కమెడియన్ గా గుర్తింపు పొందిన అశోక్ సరఫ్ సల్మాన్ ఖాన్ గురించి ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ను చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన కామెంట్స్ బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సల్మాన్ కెరీర్ బిగినింగ్ లో 1992 వచ్చిన జాగృతి అనే చిత్రంలో అశోక్ సరఫ్ కూడా నటించారంట. అయితే ఒక సీన్ లో సల్మాన్ ఖాన్ తన మెడపై కత్తి పెట్టి బెదిరించాల్సి ఉంటుంది. అయితే సల్మాన్ ఖాన్ పాత్రలో లీనమై పోయి తన మెడపై కత్తి పెట్టి తీయడం లేదని చెప్పారు.
మెడ కట్ అవుతున్నా, రక్తం కారుతున్నా 'సల్మాన్ ఖాన్.. కత్తి కోస్తోంది' అని అరిచినా సల్మాన్ ఖాన్ పాత్రలోనే లీనమై పోయారంట. సెట్ లో సిబ్బంది వెంటనే అడ్డుకున్నారని చెప్పారు. ఇప్పటికీ తన మెడపై ఆ కత్తి గాటు ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ సల్మాన్ ఖాన్ కు అది గుర్తు ఉంటుందని తెలిపారు. అప్పట్లో సినిమాలో యాక్షన్ సీన్లు చిత్రీకరించాలంటే చాలా ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వచ్చేదని ఈ ఇన్సిడెంట్ ద్వారా తెలియజేశారు.
సల్మాన్ ఖాన్ రాబోయే చిత్రం..
బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ చివరిగా సికిందర్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక నెక్ట్స్ 7 డాగ్స్ అనే చిత్రంలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అబుదాబీలో షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక సల్మాన్ ఖాన్ టాలీవుడ్ లో మెగా స్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తో అత్యంత సన్నిహితంగా ఉంటారు. చిరంజీవిపై ఉన్న అభిమానంతో గాడ్ ఫాదర్ చిత్రంలో క్యామియో అప్పియరెన్స్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











