‘రాధే’పై అప్డేట్.. జాగ్రత్తగా చూసుకోండంటూ సల్మాన్ ఖాన్ పోస్ట్

సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం రాధే అప్డేట్ వచ్చింది. తాజాగా సల్మాన్ ఖాన్ తన తదుపరి చిత్రం గురించి చెబుతూ ఇప్పుడున్న పరిస్థితిని కూడా వివరించారు. ఇప్పుడు సినీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు అందరికీ తెలిసిందే. బాలీవుడ్‌లో సినిమాలు రిలీజ్ అవ్వక, థియేటర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్‌లు ఎన్ని అవస్థలు పడుతున్నారో అందరికీ తెలిసిందే. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని సల్మాన్ ఓ అప్డేట్ ఇచ్చాడు.

ప్రభుదేవా, సల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో 'రాధే:యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్'అనే రెడీ అయిన సంగతి తెలిసిందే. అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక చకచకా షూటింగ్ పూర్తి చేసి సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. అయితే ఈ ఏడాది రంజాన్‌ కానుకగా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నానని సల్మాన్ ప్రకటించాడు. ఈ మేరకు థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లందరికీ కొన్ని సూచనలు చేశాడు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశాడు.

Salman Khan Radhe Coming to Eid 2021

థియేటర్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకోండి.. సినిమాను చూసేందుకు వచ్చే ప్రేక్షకులను జాగ్రత్తగా చూసుకోవాలి.. అవసరమైన చర్యలు తీసుకోంది.. కోవిడ్ నిబంధనలు పాటించండని సల్మాన్ కోరాడు. ఈ ఈద్‌కు రాధే థియేటర్‌లోకి రాబోతోందని ప్రకటించాడు. ఇక రాధే సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతుందేమో చూడాలి. ఇందులో సోనాక్షి సిన్హా, కిచ్చా సుదీప్ వంటి వారంతా నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X