Radhe Full Movie Free Download: సల్మాన్ ఖాన్ సినిమాకు పైరసీ దెబ్బ...!
ఓటీటీ ప్రపంచం మెల్లమెల్లగా థియేటర్ల మార్కెట్ ను డబ్బతీస్తోందనే చెప్పాలి. గతంలో ఎప్పుడు లేని విధంగా కరోనా వైరస్ దెబ్బకు జనాలు ఓటీటీకి దాసోహం అవుతున్నారు. ఇక ప్రస్తుతం సినిమా వరల్డ్ లో కొత్త సినిమాలు కూడా డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదలవుతున్నప్పటికి ఇక్కడ కూడా పైరసీ దెబ్బ తప్పడం లేదు. రాధే సినిమా వచ్చినా మరో క్షణంలోనే పైరసీ బారిన పడింది. మొబైల్ ఫోన్లలో ఒక్క క్లిక్కుతో డౌన్ లోడ్ చేసేసుకుంటున్నారు.
నగ్నంగా రేష్మీ నాయర్ ఫోటోషూట్.. దిండును అడ్డం పెట్టుకొంటూ... (ఫోటోలు)

ఎట్టి పరిస్థితుల్లో మిస్సవ్వకూడదని
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రతిసారి ఈద్ సందర్భంగా ఎదో ఒక సినిమాను విడుదల చేయడం కామన్. గత ఏడాది కరోనా దెబ్బ పడడం వలన మొదటిసారి పండగను మిస్సయిన భాయ్ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్సవ్వకూడదని ఫిక్స్ అయ్యాడు. అందుకే రాధే సినిమాను డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేశాడు.

సర్వ హక్కులు జీ స్టూడియోస్ చేతుల్లో..
సల్మాన్ ఖాన్ వీలైనంత వరకు సేఫ్ జోన్ లోనే కమర్షియల్ గా సినిమాలు చేస్తుంటాడు. ఇక ప్రభుదేవా దర్శకత్వంలో చేసిన రాధే సినిమాపై మొదటి నుంచి కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ సినిమా సర్వ హక్కులను జీ స్టూడియోస్ కు దాదాపు 250కోట్లకు అమ్మేశారని టాక్ వచ్చింది. థియేట్రికల్ గా కూడా విడుదల చేయాలని అనుకున్నారు కానీ సెకండ్ వేవ్ దెబ్బకు థియేటర్స్ క్లోజ్ అవ్వడంతో కేవలం ఓటీటీ విడుదల వైపే మొగ్గు చూపారు.

పైరసీ దెబ్బ తప్పలేదు.
కానీ సల్మాన్ కు మార్కెట్ ఉన్నా ఓవర్సీస్ లోని కొన్ని ప్రముఖమైన ప్రాంతాల్లో థియేట్రికల్ గా విడుదల చేశారు. అంతా బాగానే ఉంది గాని సినిమాను ఓటీటీలో ఎంతో జాగ్రత్తగా విడుదల చేసిన కూడా పైరసీ దెబ్బ తప్పలేదు. జీ ఫ్లెక్స్ లో పే పర్ వ్యూవ్ ఒద్దతిలో 249 రూపాయలను కేటాయించారు. దీంతో ధర ఎక్కువైందాని అనుకున్నారో ఏమోగానీ జనాలు పైరసీ వైవు యూ టర్న్ తీసుకుంటున్నారు.
Recommended Video

ఈ దెబ్బతో సగం ఆదాయం కోల్పోయినట్లే.
టెలిగ్రామ్ యాప్ లోనే సినిమాను ఇక్క క్లిక్కుతో డౌన్ లోడ్ చేసుకునే విధంగా లింక్స్ క్రియేట్ చేస్తున్నారు. ఒరిజినల్ ప్రింట్ ఏ మాత్రం తీసిపోని విధంగా అత్యదిక క్లారిటీతోనే సినిమా డౌన్ లోడ్ అవుతోంది. ఈ దెబ్బతో సినిమా సగం ఆదాయం కోల్పోయినట్లే. ఇలానే జోనసాగితే భవిష్యత్తులో ఓటీటీలో కొత్త సినిమాలను రిలీజ్ చేయాలి అంటే నిర్మాతలు భయపడకుండా ఉండలేరు. థియేటర్స్ లో వచ్చినా, ఓటీటీలలో వచ్చినా కూడా పైరసీ భూతం వడలట్లేదు. మరి భవిష్యత్తులో దీనికి ఇలాంటి సమాధానం వెతుకుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











