For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రికార్డు స్థాయిలో ఫస్ట్ డే రాధే రికార్డ్ కలెక్షన్స్.. అంత భారీగా వచ్చినా లాభం లేదు!

  |

  బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన తాజా సినిమా 'రాధే'. ఈద్ కానుకగా ఈ సినిమా గురువారం నాడు(మే 13న) విడుదలైంది. అయితే ఈ సినిమాను కరోనా కారణంగా థియేటర్స్ తో పాటు, జీప్లెక్స్ ద్వారా జీ5 ఓటీటీలో కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాని చూసేందుకు ఎక్కువ సంఖ్యలో అభిమానులు ఒకేసారి లాగిన్ అయ్యే ప్రయత్నం చేశారు. అయితే చాలా మంది లాగిన్ అయ్యే ప్రయత్నం చేయడంతో ఈ ఓటీటీ సర్వర్లు.. స్తంభించిపోయాయి. అంతే రేంజ్ లో ఈ సినిమా కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

  ఓటీటీలు క్రాష్

  ఓటీటీలు క్రాష్


  బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. ఆయనకు దేశ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. స‌ల్లుభాయ్ నుంచి సినిమా వ‌చ్చిందంటే చాలు బాలీవుడ్‌లో అయితే ఒకరకంగా సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. ఆయన సినిమాల కలెక్షన్స్ తో రికార్డులు బ‌ద్ద‌ల‌వుతాయి. అయితే స‌ల్మాన్ స్టామినా కేవ‌లం థియేట‌ర్ల‌కే ప‌రిమితం కాలేదు ఓటీటీలోనూ త‌న‌కు సాటిలేద‌ని భాయ్ చాటి చెప్పారు.

  సెంటిమెంట్ ప్రకారం

  సెంటిమెంట్ ప్రకారం

  సెంటి మెంట్ ప్రకారం ‘రాధే' సినిమాను ఈద్‌ కానుకగా గురువారం (మే 13) విడుదల చేశారు. కరోనా కారణంగా థియేటర్లతో పాటు ఏకకాలంలో ఓటీటీలో కూడా విడుదల చేశారు. కరోనా భయంతో జానాలు థియేటర్లకు వెళ్లలేదు కానీ, ఓటీటీలో చూసేందుకు మాత్రం ఎగబడ్డారు. ఈ సినిమాను మేక‌ర్స్ జీ5 ఓటీటీలో విడుద‌ల చేశారు. దీంతో గురువారం సల్మాన్‌ ఖాన్‌ అభిమానులు పెద్ద ఎత్తున జీ5, జీప్లెక్స్‌ లాగిన్‌ అయ్యేందుకు ప్రయత్నించడంతో స‌ర్వ‌ర్ క్రాష్ అయ్యింది.

  రికార్డు స్థాయి కలెక్షన్స్

  రికార్డు స్థాయి కలెక్షన్స్


  ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. దాదాపు వంద కోట్లకు పైగా మొదటి రోజు సినిమా ఒక్క జి ఫైవ్ యాప్ ద్వారానే సంపాదించినట్లు చెబుతున్నారు. జి ఫైవ్ యాప్ లోని జీ ఫ్లెక్స్ ద్వారా కేవలం మొదటి రోజు 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్టు చెబుతున్నారు.
  ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దిశాపటానీ హీరోయిన్ గా నటించగా రణదీప్ హుడా మేఘా ఆకాష్ ఇలాంటి వాళ్ళకి కీలక పాత్రలు పోషించారు. నిజానికి ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ దక్కలేదు. అయినా సరే ప్రేక్షకులు మొదటిరోజు సినిమాకి బ్రహ్మరథం పట్టారు.

  రికార్డు వ్యూస్..

  రికార్డు వ్యూస్..


  ఇక ఈ సినిమా మొదటిరోజు దాదాపు 4.5 మిలియన్ హిట్స్ సాధించినట్లుగా జి ఫైవ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇది ఒక చరిత్ర అని వాళ్ళు తమ అధికారిక ఖాతాల్లో పేర్కొన్నారు. మరోపక్క ఈ సినిమాకి కూడా బాయ్ కాట్ సెగ ఈ చిత్రానికి కూడా తగిలింది. సోషల్ మీడియాలో 'రాధే' చిత్రాన్ని బ్యాన్ చెయ్యాలని నెటిజన్స్ పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. నెపోటిజం సహా గత ఏడాది మరణించిన టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సానుభూతిపరులు ఈ ట్రెండ్ వెనుక ఉన్నారని భావిస్తున్నారు. ఈ 'బాయ్ కాట్ రాధే' హ్యాష్ ట్యాగ్ జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతుండటం విశేషం.

  Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
  అవన్నీ విరాళమే

  అవన్నీ విరాళమే

  దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తోంది. ఈ క్రమంలో రాధే మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ను.. కరోనాపై పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వానికి విరాళంగా అందజేస్తామని గతంలోనే సినిమా యూనిట్ ప్రకటించింది. సల్మాన్ మూవీ కాబట్టి.. మొదటి రోజు భారీ కలెక్షన్లు వస్తాయని అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇప్పుడు వంద కోట్ల విరాళం కరోనా మీద పోరుకు అందనుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో లాభాపేక్షకి పోకుండా సల్మాన్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ అభినందిస్తున్నారు

  English summary
  Salman khan's latest movie radhe your most awaited bhai released on zee5 app on the eve of ramzan. The movie created some records in OTT release. According to Zee5 app the movie has got 4.2 million views on the first day itself. and its estimated collections are more hundred crore for the first day. Before releasing the movie the unit has announced that the first day collection will be donated to few NGOs and government for Corona protection.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X