సల్మాన్ ఖాన్ 'రాధే' కొత్త ప్లాన్.. థియేటర్స్, ఓటీటీలో ఒకేసారి.. అత్యధిక ధరకు డీల్ క్లోజ్

బాలీవుడ్ ఇండస్ట్రీని కూడా కరోనా గట్టి దెబ్బె కొట్టింది. టాలీవుడ్. కోలీవుడ్ లో కనీసం మూడు నెలలు సినిమాల హడావుడి నడిచింది. కానీ బాలీవుడ్ లో మాత్రం అలాంటి వాతావరణం కనిపించలేదు. ఇక ప్రస్తుతం అందరు సల్మాన్ ఖాన్ రాధే కోసమే చూస్తున్నారు. ఆ సినిమా పూర్తయ్యి దాదాపు ఏడాది కావొస్తోంది. ఇక ఫైనల్ గా ఇప్పటికి ఒక డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు.

Recommended Video

Radhe రిలీజ్ డేట్ ఫిక్స్,OTT లో కూడా | Salman Khan || Filmibeat Telugu

సముద్ర తీరంలో సానియా గ్లామర్ డోస్.. యువ హీరోయిన్ గ్లామర్ జోరు

ప్రతి ఏడాది ఈద్ సందర్భంగా

ప్రతి ఏడాది ఈద్ సందర్భంగా

సాధారణంగా సల్మాన్ ఖాన్ ప్రతి ఏడాది ఈద్ సందర్భంగా ఒక సినిమాను రిలీజ్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ గత ఏడాది కరోనా ఉండడం వలన కొత్త సినిమాను రిలీజ్ చేయడం కుదరలేదు. సంజయ్ లీలా భన్సాలీతో ఒక బిగ్ బడ్జెట్ సినిమాతో రావాలని అనుకున్నాడు. ఆ సినిమా స్క్రిప్ట్ దశలోనే ఆగిపోయింది.

రాధే.. డేట్ ఫిక్స్

రాధే.. డేట్ ఫిక్స్

ఇక మొత్తానికి రాధే సినిమాతో ఈ ఈద్ పండగకు సరికొత్త కిక్కివ్వాలాని సల్మాన్ టార్గెట్ సెట్ చేసుకున్నాడు. ప్రభుదేవా దర్శకత్వంలో చేసిన రాధే సినిమా గత ఏడాది సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సింది. కానీ అనుకోకుండా కరోనా గట్టి దెబ్బె కొట్టింది. ఇక ఇప్పుడు 13న విడుదల చేయడానికి రెడీ అయ్యారు.

ఒకేసారి ఓటీటీ, థియేటర్స్ లో..

ఒకేసారి ఓటీటీ, థియేటర్స్ లో..

అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా రాధేశ్యామ్ ను కొత్తగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ హక్కులతో పాటు మిగతా డిజిటల్ ఓటీటీ హక్కులను జీ సంస్థ సొంతం చేసుకుంది. ఇక వారి ఆలోచన ప్రకారమే సినిమాను ఒకేసారి థియేటర్స్ లోను అలాగే డిజిటల్ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లలో రిలీజ్ చేయనున్నారు. ఇక ట్రైలర్ ను గురువారం రిలీజ్ చేయబోతున్నారు.

అత్యదిక ధరకు అమ్ముడైన సినిమా

అత్యదిక ధరకు అమ్ముడైన సినిమా

అయితే డిజిటల్ లో సినిమాను పే పర్ వ్యూ కండిషన్ తో విడుదల చేయబోతున్నారు. అంటే సినిమాను ఒక్కసారి చూడాలి అంటే థియేటర్ టిక్కెట్టు ధర ప్రకారమే ఆన్ లైన్ పేమెంట్ తో సినిమాను చూడాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమాను జీ సంస్థ సర్వ హక్కులను దాదాపు రూ.230కోట్లకు కొనుగోలు చేసినట్లు గతంలో టాక్ వచ్చిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ అనంతరం అత్యదిక ధరకు అమ్ముడైన సినిమా ఇదే కావడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X